రూ.9 వేలలోపే నోకియా కొత్త ఫోన్..
రూ.9 వేలలోపే నోకియా కొత్త ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో!
నోకియా రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. వీటిలో నోకియా సీ30 స్మార్ట్ ఫోన్ కాగా, నోకియా 6310 (2021) ఫీచర్ ఫోన్. ఇవి ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే లాంచ్ అయ్యాయి.
ప్రధానాంశాలు:
నోకియా సీ30, 6310(2021) వచ్చేశాయ్
ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Nokia C30
నోకియా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే నోకియా సీ30. ఇందులో ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంను అందించారు. దీంతోపాటు నోకియా 6310(2021) ఫీచర్ ఫోన్ కూడా లాంచ్ అయింది. ఇందులో స్నేక్ గేమ్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 1150 ఎంఏహెచ్‌గా ఉంది. ఇవి ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
నోకియా సీ30 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 99 యూరోలుగా(సుమారు రూ.8,700) నిర్ణయించారు. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రీన్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా 6310(2021) ధర
దీని ధరను 40 యూరోలుగా(సుమారు రూ.3,500) నిర్ణయించారు. బ్లాక్, డార్క్ గ్రీన్, లైట్ బ్లూ, ఎల్లో రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.
నోకియా సీ30 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.82 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై నోకియా సీ30 పనిచేయనుంది. 3 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు. 3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.99 సెంటీమీటర్లుగానూ, బరువు 237 గ్రాములుగానూ ఉంది.
నోకియా 6310 (2021) స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ ఎస్30ప్లస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఐకానిక్ స్నేక్ గేమ్‌ను కూడా ఇందులో అందించారు. బిల్ట్-ఇన్ ఎల్ఈడీ టార్చ్ కూడా ఇందులో ఉంది. యూనిసోక్ 6531ఎఫ్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 16 ఎంబీ ర్యామ్, 8 ఎంబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మైక్రో యూఎస్‌బీ పోర్టు, వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5.0, వైఫై సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.