ధర్నా చౌక్ స్థల పరిశీలన చేయండి…కమిషనర్ గిరీష
చిత్తూరు జిల్లా:తిరుపతి,అనేక ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు అనేక ప్రాంతాల్లో నిత్యం ధర్నాలు,నిరసనలు చేయడం వలన సామాన్య ప్రజానికానికి,అత్యవసర సర్వీసులకు అనేక సంధర్భాల్లో ట్రాఫిక్ సమస్యలు,లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏర్పడుతున్నాయని,వీటికి పరిష్కారంగా ఓక ప్రదేశంలో ధర్నాలు,నిరసనలు చేపట్టెలా ధర్నా చౌక్ ను ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ అన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో శనివారం కమీషనర్ గిరీషతో తిరుపతి లా అండ్ ఆర్డర్ ఏ.ఎస్.పి.ఆరీపూల్ల,ఈస్ట్ డి.ఎస్.పి.మురళీకృష్ణ, ట్రాఫిక్ డి.ఎస్.పి.మల్లిఖార్జున, కమాండ్ కంట్రోల్ డి.ఎస్.పి.కొండయ్య, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి సమావేశమైనారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేయడం పరిపాటేనని,కానీ దీని వలన సామాన్య ప్రజలకు,అత్యవసర సేవలను దృష్టిలో పెట్టుకొని ధర్నా చౌక్ ను ఏర్పాటుచేయాలని నిర్ణయించడం జరిగింది.తిరుపతి నగరంలో మరికొన్ని చోట్ల సిసి కెమెరాలకు అనువైన,అవసరమైన స్థలాలను స్థలాలను గుర్తించి కెమరాలను ఏర్పాటుచేయాలను,లెప్ట్ టర్న్ లు సజావుగా వెల్లేలా వుండే ప్రాంతాలను గుర్తించి అందుకు అవసరమైన పనులను చేయాలన్నారు.నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేయవల్సిన పనుల గురించి చర్చించి,పరిష్కారానికి తీసుకోవల్సిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించాలన్నారు.