అపోలో ఆసుపత్రికి ఈటెల రాజేందర్


మాజీ మంత్రి, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
నిన్న పాదయాత్రలో భాగంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
తొలుత ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
వరుసగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఈటల రాజేందర్ 12వ రోజున పర్యటనలో భాగంగా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు.
జమ్మికుంట వైద్యులు తొలుత చికిత్స అందించిన అనంతరం వారి సూచన మేరకు హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఈటలకు జ్వరంతో పాటు కాళ్లు మొత్తం బొబ్బలు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలాఉండగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జి.వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ అపోలో ఆస్పత్రికి వచ్చి ఈటలను పరామర్శించారు.

About The Author