అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల ముఠా అరెస్ట్

చిత్తూరు జిల్లా:తిరుపతి అర్బన్ జిల్లాలో గత మూడు, నాలుగు నెలలుగా జరుగుతున్న మోటార్ సైకిల్ చోరీ కేసులపై దృష్టి సారించిన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు క్రైమ్ నేరాల కట్టడికోసం పాత నేరస్తుల పై, జైలు నుంచి రిలీజైన నేరస్తులపై ప్రత్యేక నిఘా యేర్పాటు చేసి వారి కదలికలపై నిఘా ఉంచి తనికీ చేయమని ఆదేశాలు ఇచ్చినారు.

జిల్లా యస్.పి గారి ఆదేశాలతో తిరుపతి, తిరుచానూరు, క్రైమ్ పోలీసులు సి.ఐ ల ఆద్వర్యంలో ప్రత్యేక టీములు గా ఏర్పడి క్రైమ్ అడిషనల్ యస్.పి శ్రీ మునిరామయ్య, ఈస్ట్ సబ్ డివిజన్ యస్.డి.పి.ఓ శ్రీ మురళి కృష్ణ, మరియు క్రైమ్ డి.యస్.పి జి.మురళీధర్ వారి సూచనలు పాటిస్తూ పాత నేరస్తుల పై, జైలు నుంచి రిలీజైన నేరస్తులపై ప్రత్యేక నిఘాఏర్పాటు చేయడం జగిరింది.

30-7-2021, 31-07-2021 వ తేదీలలో  పూడి క్రాస్,  తణపల్లి మార్కెట్ యార్డ్ క్రాస్ వద్ద వాహనముల తనిఖీ చేయుచుండగా 1.జీవ @ చందు చెంగమ నాయుడు కండ్రిగ, విజయపురం, 2.పల్లిపట్టు సునీల్ కుమార్  వేదయపాలం, నెల్లూరు 3.చిట్టి బాబు, ఎల్లా సముద్రం గ్రామం విజయపురం లను తిరుచానూరు పోలీస్ వారు అరెస్ట్ చేయగా, నంది మంగళం గ్రామం, పుత్తూరు మండలంకు చెందిన ఒకరు, కదిరి పట్టణంలోని శివాలయం వీధికి చెందిన నేరస్తులను తిరుపతి క్రైమ్ వారు అరెస్టు చేసినారు.

వారి వద్ద నుండి 30 లక్షల విలువ చేయు 40 మోటార్ సైకిళ్ళు తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్  9  కేసులు, తిరుచానూర్ కు చెందినా 10 అలిపిరి  పోలీసు స్టేషన్ కు సంబంధించిన 1 కేసులు, నంద్యాల, మైదుకుర్, మరియు బళ్ళారికి మరియు చుట్టుపక్కల దొంగతనము కేసులలో ఉన్న 20 మోటార్ సైకిల్ల్లను మొత్తం 40 మోటార్ సైకిళ్ళను  స్వాధీనం చేసుకున్నారు. 

వీరిలో క్రైమ్ పోలీస్ వారు అరెస్ట్ చేసినవారికి, అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల ముఠా నేరస్తులు అనంతపురం జిల్లా మడకశిర పట్టణానికి చెందిన సుమంత్ బాబు అలియాస్ పులి, దివాకర్ రెడ్డి లతో సంబందము కలదు వారితో కలసి పై నేరములు చేసినట్లు చెప్పినారు.  సదరు సుమంత్ బాబు, దివాకర్  నేరస్తులు గత నెలలో పిలేర్ పోలీస్ వారితో అరెస్ట్ కాబడి జైలు లో ఉన్నట్లు తెలిపినారు వారిని పోలీస్ కస్టడీ కి తీసుకుని అరెస్ట్ ద్వార తదుపరి విచారణ చేస్తామని చెప్పినారు.

పై నేరస్తులను అరెస్టు చేయడంలోను, చోరీ సొత్తులు రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన తిరుపతి క్రైమ్ సి.ఐ లు చిరంజీవి రావు, మోహన్, తిరుచానూర్ సుధాకర్ రెడ్డి, యస్.ఐ లు వీరేశ్,  రామకృష్ణ రెడ్డి, నరసింహ లను, సిబ్బందిని  జిల్లా యస్.పి గారు అబినందిస్తూనట్లు తెలిపినారు.

About The Author