ఏపీ సర్కార్‌పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు.


ఏపీ సర్కార్‌పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. వివిధ కారణాలతో తనపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఇప్పటివరకు 72 కేసులు పెట్టారని.. మరో నాలుగు కేసులు పెట్టుకోవాలని సూచించారు. తాను జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్‌పై ఆందోళన చెందుతున్నానని.. ఎవరినీ సంతోష పెట్టేందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు.
ఎక్కడ దాక్కునా పోలీసులు వదిలిపెట్టరని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కొందరు పాలకులు ఒత్తిడి మేరకు పనిచేస్తున్నారని చెప్పారు. టైగర్ మ్యానిటర్ అయినట్లుగా తాడిపత్రిలో ఓ ఆయన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోటకు వెళ్లి నమస్కారం పెట్టివస్తోన్నారని ఆరోపణలు చేశారు.

తాడిపత్రిలో సమస్యలకు కారణం ఒకటిన్నర సంవత్సరం క్రితమే ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమన్నారు.
ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకే తాను జవాబు ఇచ్చానని పేర్కొన్నారు. ”నిన్ను కొడతా.. రెండు సెకండ్లలో ఊరి విడిపిస్తా అని మాట్లాడటం రెచ్చగొట్టడం కాదా? అరెస్టులకు భయపడను. వాళ్లు రమ్మంటే మేం పోతావుంటాము. ఎవరొస్తే వాళ్లను సతాయిస్తారంటే… రేపు ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా వుంటాయి” అని ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేశారు. అన్నీ గుర్తెరిగి వ్యవహరించాలని సూచించారు.
మీసాలు తిప్పితే కేసులు పెడుతారా? అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. న్యాయ పరంగా పోరాటం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేసి వుంటే తాను మీసం మెలేసేవాడిని కాదన్నారు. రెచ్చగొడితే.. మేం కూడా అలా బీహేవ్ చేయాల్సి వస్తుందని చెప్పారు.

About The Author