10న గూడూరు వరకే విజయవాడ-చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్
చెన్నై: విజయవాడ-చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య తిరుగాడే స్పెషల్ ఎక్స్ప్రెస్ (02711/02712) (పినాకినీ) ఈనెల 10వ తేదీన గూడూరు వరకే పరిమితం కానుంది. నాయుడుపేట – పెదపరియ స్టేషన్ల మధ్య రైల్వేమార్గంలో మరమ్మతు చేపడుతున్న కారణంగా ఆ రోజున ఈ రైలు ను విజయవాడ – గూడూరు మధ్య మాత్రమే నడపాలని అధికారులు నిర్ణయిం చారు. ఆ మేరకు 10వ తేదీ ఉదయం 6.10 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ రైలు గూడూరు వరకు వచ్చి నిలిచిపోతుంది. మళ్లీ ఆ రైలు సాయంత్రం 4.20 గంటలకు గూడూరు నుంచి విజయవాడకు బయలుదేరుతుంది.