సరికొత్త రికార్డును సృష్టించిన కియా మోటార్స్‌..!


దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా భారత మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ ఆటోమోటివ్‌ మార్కెట్‌లో 3 లక్షల కార్లను అమ్మినట్లు కియా ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల అమ్మకాల్లో అత్యంత వేగవంతమైన బ్రాండ్‌గా దక్షిణ కొరియా వాహన తయారీ కియా ఇండియా నిలిచింది. భారత మార్కెట్‌లోకి 2019 ఆగస్టులో కియా కార్ల అమ్మకాలను ప్రారంభించింది.దేశ వ్యాప్తంగా కియా 2020 జూలైలో మొదటి లక్ష కార్ల అమ్మకాలు జరుపుగా, తదుపరి లక్ష కార్ల అమ్మకాలు జనవరి 2021లో సాధించగా , 2021 ఆగస్టులో మొత్తంగా మూడు లక్షల కార్ల అమ్మకాలను కియా జరిపింది. కియా కార్ల అమ్మకాల్లో సెల్టోస్‌ 66 శాతం, తరువాతి స్థానంలో సోనెట్‌ 32 శాతం దేశీయ మార్కెట్‌లో స్థానాన్ని సంపాదించాయి. దేశవ్యాప్తంగా కియా కార్నివాల్‌ 7310 యూనిట్లను విక్రయించింది.

కియా ఇండియా ఎమ్‌డీ, సీఈవో కూఖున్ షిమ్ మాట్లాడుతూ.. అమ్మకాల్లో కియా సాధించిన ఘనతపై ఆనందం వ్యక్తం చేశారు. కియా కార్లకు మంచి ఆదరణను అందించిన భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు. కియా తన సర్వీస్‌ కేంద్రాల సంఖ్యను 300 నుంచి 360కిపైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.

About The Author