కలిసి, మెలిసి నడుద్దామని పిలుపు నిచ్చిన భూమన…

తిరుపతి ; తిరుపతి బలిజల సమ్మేళనం 

ఆదివారం ఉదయంస్థానిక డీ పీ ఆర్ కల్యాణ మండపంలో జరిగింది. కార్యక్రమానికిముఖ్య అతిధిలుగా విచ్ఛేసిన భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ కి అపూర్వ స్వాగతం లభించింది. సర్వమత పెద్దలు ఆశీర్వదించారు.  అనంతరం కరుణాకర  రెడ్డి,  అభినయ్ ల రాజకీయ ప్రస్థాన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

బలిజ సామాజిక వర్గాల ప్రతినిధులు దుశ్శాలువలు కప్పి, పుష్ప గుచ్చాలు సమర్పించి, గజ మాలతో సత్కరించారు. భూమన కుటుంబం పై తమకు ఉన్న అపూర్వ  అభిమానాన్ని చాటుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ కృష్ణ దేవరాయలు చిత్ర పటాలకు భూమన కరుణాకర రెడ్డి, భూమన అభినయ్ పుష్పాంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తొలి నుంచి తాను కుల రాజకీయాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా,  అభ్యుదయ భావజాలం తో జీవించానని పునరుద్ఘాటించారు.

అట్టడుగు వర్గాల ప్రజలకు వీలైనన్ని మేళ్లు చేయడమే లక్ష్యంగా పని చేశామన్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీసిన వాళ్ళను కూడా ఆదరించిన మనస్తత్వం  తనదన్నారు. ఎవరైనా వారి స్వార్థంతో తనను వదిలి వెళ్లుంటారే గానీ…తానేవరినీ వదులుకోలేదన్నారు. 

అంతే తప్ప కులాల గురించి తక్కువ చేసి మాట్లాడలేదని భగవంతుడు మీద ఒట్టేసి చెప్పారు. మీరంతా రాజకీయ తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు.

భవిష్యత్ లోకూడా అందరం కలిసి, మెలిసి ఐక్యంగా పనిచేద్దామని పిలుపు నిచ్చారు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుందా

మన్నారు. అనురాగం, ఆప్యాయతలతో జీవించాలని ఆకాంక్షించారు. మీ అవసరాలు తీర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని సభను ఉద్దేశించి భరోసా ఇచ్చారు. తనతో తొలి నుంచి ప్రయాణిస్తున్న 

వారికి రుణపడి ఉంటామన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… కాపు, బలిజ సామాజిక వర్గాలకు తగిన న్యాయం చేస్తున్నారని తెలిపారు. 

ఈ క్రమంలోనేకాపు నేస్తం పథకం కింద తిరుపతిలో  ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ మాట్లాడుతూ తమ కుటుంబానికి తొలి నుంచి అండగా నిలుస్తున్నందుకు రుణపడి ఉంటామని, శిరస్సు వంచి నమస్కరించారు. తనకు తోడ్పాటు అందిస్తున్న బలిజ సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతికి…

తన శ్వాస ఉన్నంత కాలం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  ఆత్మీయ సభ ద్వారా తమ కుటుంబం పై నిర్వాహకులు అపూర్వ ఆదరణ చూపారన్నారు.

డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ సాధారణ కార్యకర్తగా  భూమన కరుణాకర రెuడ్డి  అనుచరుడుగా కొనసాగుతున్నాని, భూమన కరుణాకర రెడ్డి చలువతో రాజకీయ పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో పనిచేసే అవకాశం కల్పించారని తెలిపారు. భూమన కరుణాకర రెడ్డి చలువతోతొలి డిప్యూటీ మేయర్ గా బలిజ సామాజిక వర్గానికి చెందిన తనకు దక్కిందన్నారు. బలిజలకు భూమనఅధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అనడానికి ఇదే నిదర్శనమన్నారు. భూమన కరుణాకర రెడ్డి ఎమ్మెల్యే గా  బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుపతిలో బలిజ సామాజిక వర్గాలకు అనేక  నామినేటెడ్ పదవులు దక్కాయన్నారు.

About The Author