ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు ఇచ్చి తీరుతాం: మంత్రి హరీశ్ రావు


ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ లోనే మకాం వేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని అన్నారు. రైతు బంధుపై దుష్ప్రచారం చేసినట్టే, ఇప్పుడు దళిత బంధుపైనా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దళిత బంధు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నిజంగానే దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని వెల్లడించారు.

About The Author