ట్విట్టర్ కు గుడ్ బై చెపుతున్నట్టు బండ్ల గణేశ్ ప్రకటన


సినీ నిర్మాత, హాస్య నటుడు బండ్ల గణేశ్ ఏది చేసినా సంచలనమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన మాటలు కానీ, చేతలు కానీ జనాల్లోకి చొచ్చుకుపోతాయి. తాజాగా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ నుంచి వైదొలగుతున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలోనే ట్విట్టర్ కు గుడ్ బై చెప్పేస్తానని అన్నారు. ఎలాంటి వివాదాలు వద్దని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. ట్విట్టర్ ను ఉపయోగించడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా ఎదురవుతోందనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ పట్ల అభిమానులు పెద్ద ఎత్తున ప్రతిస్పందిస్తున్నారు. ఎందుకు? ఏమైంది? అని ప్రశ్నిస్తున్నారు.