భూమన చొరవతో రుయాలో మెరుగైన సౌకర్యాలు.. – కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిలబెట్టడమే లక్ష్యం
తిరుపతి ; పేదల ఆసుపత్రి గా గుర్తింపు పొందిన రుయా ఆస్పత్రికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చొరవతో మెరుగైన సౌకర్యాలు అందుబాటు లోకి వస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా రుయాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భూమన
కృషి చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తిని ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల రుయా ఆసుపత్రి స్థాయికి మించి ఆక్సిజన్ నిల్వలను అందుబాటు లోకి తీసుకోచ్చిన విషయం తెలిసిందే. తాజా గా రుయాలో మరో 24 బాడీ ఫ్రీజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బాడీ ఫ్రీజర్ ల కొరత ఉండటంతో… జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ దృష్టికి తీసుకురావడం, ఆ వెంటనే బాడీ ఫ్రీజర్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రుయా మార్చురీ వద్దసుమారు 24 లక్షల రూపాయల అంచనాలతో ఏర్పాటు చేసిన 24 ఫ్రీజర్లను
శనివారం సాయంత్రం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో రుయా అభివృద్ధి వర్కింగ్ కమిటీ చైర్మన్ బండ్ల చంద్ర శేఖర్ పాల్గొన్నారు.