అప్పులు తీర్చ లేక – అవమానం భరించ లేక ఓకే కుటుంబంలో ముగ్గురు ఆత్మ హత్య

చిత్తూరు జిల్లాలో,పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామములో ఓ  వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోగా అప్పులు ఇచ్చిన వారు ఆ వ్యక్తి ఇంటికెళ్లి ఆతని కుటుంబ సభ్యులును అసభ్య పదజాలంతో దూషించడం,శాపనార్ధాలు పెట్టడంతో అవమానం భరించలేక పురుగుల మందు త్రాగి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మ ,

హత్య చేసుకున్న సంఘటన  చోటు చేసుకుంది.దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.స్థానికుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి.చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం చెందిన శంకరయ్య పెద్ద  కుమారుడు సతీష్ ( 35) అప్పులు చేసి తీర్చలేక ఊరి వదిలి వారం క్రితం పరారైయ్యాడు.ఈ విషయం తెలుసుకున్న అప్పులు ఇచ్చిన వారు సతీష్ ఇంటికి వెళ్ళి తమ వద్ద తీసుకున్న అప్పులు తీర్చాలని గొడవకు దిగినట్టు సమాచారం.అంటే కాకుండా అసభ్యపద జాలంతో సతీష్ కుటుంబ సభ్యులును దూషించడంతో తన కుమారుడు చేసిన అప్పు తీర్చే స్థోమత లేక , అవమానం భరించలేక సతీష్ తండ్రి శంకరయ్య (65), తల్లి గురమ్మ( 55), వినయ్( 22)లు పురుగులు మందు తాగారు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు

About The Author