రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ మరికొంత కాలం పొడిగింపు

కొవిడ్ కారణంగా రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ నిబంధనలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఉన్న కర్ఫ్యూను కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలన్నారు. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జనం ఊరేగింపు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ అన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా సిబ్బంది

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకంపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఖాళీలు గుర్తించి 90 రోజుల్లో నియమించేందుకు తీసుకునే చర్యలపై అధికారుతో చర్చించారు. ప్రక్రియ పూర్తయ్యాక వైద్యులు, సిబ్బంది లేరనే మాట రాకూడదని అధికారులతో సీఎం అన్నారు. బయోమెట్రిక్‌తో పక్కాగా హాజరు, పనితీరుపై పర్యవేక్షణ ఉండాలన్నారు.

About The Author