సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర కులాల్లోని పేదలకు ఈ పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన చేస్తున్నారు సీఎం కేసీఆర్. వరుస క్రమంలో అందరికీ దళిత బంధు లాంటి పథకం అమలు చేసే యోచనలో ఉన్నారు.

దళితబంధు పథకం అమలు విషయంలో మిగతా వర్గాలు సహకరించాలని..వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ లో దళితబంధు పథకం కోసం రూ. 20 వేల కోట్లు పెడతామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

అలాగె సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పొతామని…తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదనీ.. కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు.

About The Author