AP పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు COUNCELLING నోటిఫికేషన్‌ విడుదలైంది.


రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

నోటిఫికేషన్‌ వివరాలను పరిశీలిస్తే..
►అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.
►అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది.
►అక్టోబర్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం కల్పించాం.
►అక్టోబర్ 9న ఆప్షన్స్‌ మార్చుకునే అవకాశం ఉంది.
►అక్టోబర్ 11న సీట్లు కేటాయింపు ఉంటుంది.
►అక్టోబర్ 12 నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

About The Author