నిరుత్సాహంలో టపాసుల వ్యాపారవేత్తలు.. ఈ దీపావళి పండుగకు పెట్టిన ఆదాయం తిరిగివస్తుందో ..?

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చేరు నియోజకవర్గం.

పఠాన్ చేరు పట్టణంలో మైత్రి గ్రౌండ్ లో టపాసుల వ్యాపారస్థులు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి టపాసుల వ్యాపారం మరి దారుణంగా ఉందని, తాము ప్రతి ఏడాది టపాసుల వ్యాపారం చేస్తున్న క్రమంలో.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంది.
రెండు సంవత్సరాలనుండి కరోనా భయం ఒకటి ప్రజలు ఇప్పుడిప్పుడే దైర్యం తో వారి కుటుంబాలతో బయటకు వస్తున్నారు, ఈ దీపావళి పండుగకు కనీసం పెట్టిన ఆదాయం కూడా వచ్చే విధంగా అనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

About The Author