ప్రతి రోజు చీర ధరించాల్సిందే..విద్యాసంస్థల ఒత్తిడి

ప్రతి రోజు చీర ధరించాల్సిందే..విద్యాసంస్థల ఒత్తిడి

కేరళలోని అనేక విద్యాసంస్థలలో మహిళా టీచర్లను తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం పై విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు స్పందింస్తూ.. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి.. కేరళ ప్రగతిశీల వైఖరికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు మాట్లాడుతూ ‘‘ఎలాంటి దుస్తులు ధరించాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో మీ జోక్యం ఏంటంటూ’’ విద్యాసంస్థల యాజమాన్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో ఉపాధ్యాయులు ఎలాంటి సంస్థలలో పనిచేసినా సరే.. వారి సౌకర్యానికి తగ్గట్టుగా దుస్తులు ధరించే హక్కు ఉంది. తాను మినిస్టర్‌ని మాత్రమే కాక కేరళ వర్మ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నానని తెలిపారు. కాలేజీకి చుడిదార్‌లు వేసుకెళ్తాను అన్నారు.

మినిస్టర్‌ బిందు మాట్లాడుతూ.. “ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. “ఒక టీచర్‌కు అనేక బాధ్యతలు ఉంటాయి. ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదు. మరొకరి దుస్తుల ఎంపికను విమర్శించే, జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు”. ఒకరి దుస్తుల ఎంపిక పూర్తిగా వారి వ్యక్తిగత విషయం.

మే 9, 2014న ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసిందని అయినప్పటికి , రాష్ట్రంలోని అనేక సంస్థలు ఇలాంటి పద్ధతులను కొనసాగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అందుకే మరోసారి ఉత్తర్వులు జారీ చేశామని మినిస్టర్‌ తెలిపారు.

About The Author