మీకు తెలుసా ఫల జ్యోతిష్యము గురించి…?

కలలో జామపండు తింటున్నట్లు కనిపిస్తే అది శృంగారాన్ని సూచిస్తుంది. చెట్టు నుంచి కాయ కోసుకొని తింటున్నట్లు కలగంటే మాత్రం మీ శృంగార జీవితం కరిగిపోతుందని చెబుతుంది.

మీ కలలో అరటి పండు తిన్నట్లయితే మీరు పూర్తిగా సంతృప్తి చెందారని, భవిష్యత్తులో మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారని అర్థం..

కలలో దానిమ్మ పండు కనిపిస్తే అది శుభంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా శుభ సంకేతాన్ని కలిగిస్తుంది.

కలలో స్ట్రాబెర్రీలు లేదా ఇతర బెర్రీలు తింటున్నట్లు కనిపిస్తే అది మీ ఆకస్మిక ఆనందాన్ని మరియు త్వరలో మీరు అదృష్టాన్ని పొందబోతున్నారని తెలుసుకోవాలి.

కలలో నారింజ పండు తింటున్నట్లు వస్తే అది చాలా మంచిది. అంతేకాకుండా మీరు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి.

కలలో పైనాపిల్ తింటున్నట్లు వస్తే ప్రతిదీ క్రమంగా జరుగుతోందని, మీ జీవితం అందంగా మారుతోందని అర్థం.

About The Author