మీ యొక్క బ్యాంకు ఎకౌంటు రివార్డ్ పాయింట్స్ రెడీం చేస్తామని చెప్పే లింక్స్ ను నమ్మవద్దు…


మీ యొక్క బ్యాంకు ఎకౌంటు రివార్డ్ పాయింట్స్ రెడీం చేస్తామని చెప్పే లింక్స్ ను తప్పుడు ఫోన్ కాల్స్ ను నమ్మి ఆన్లైన్లో మోసపోవద్దు

తిరుపతికి చెందిన ఒక వ్యక్తి తన మొబైల్ కి ICICI బ్యాంకు account కు సంబంధించిన reward points redeem చేసుకోవాలని ఒక లింక్ వస్తుంది. సదరు వ్యక్తి ఆ యొక్క లింక్ బ్యాంకు నుండి వచ్చినదని నమ్మి లింక్ ను క్లిక్ చేయడంతో, బాధితుడు తన బ్యాంకు డెబిట్ card వివరాలను అందులో ఎంటర్ చేయగా, అతని అకౌంట్ నుండి రూ. 1,22,210/- డెబిట్ అవుతుంది. బాధితుడు తను మోసపోయానని తెలుసుకుని, వెంటనే తిరుపతి cyber police వారిని సంప్రదించగా NCRP portal ద్వారా compliant register చేయించి. బాధితుడు ఆన్లైన్ లో మోసపోయిన మొత్తం అమౌంట్ రూ 1,22,210/- లను refund చేయించడం జరిగింది.

తిరుపతికి చెందిన ఒక వ్యక్తి తన మొబైల్ కి Axis Bank account కు సంబంధించిన reward points redeem చేసుకోవాలని ఒక లింక్ వస్తుంది. సదరు వ్యక్తి ఆ యొక్క లింక్ బ్యాంకు నుండి వచ్చినదని నమ్మి లింక్ ను క్లిక్ చేయడంతో, బాధితుడు తన బ్యాంకు డెబిట్ card వివరాలను అందులో ఎంటర్ చేయగా, అతని అకౌంట్ నుండి రూ. 1,99,870/- డెబిట్ అవుతుంది. బాధితుడు తను మోసపోయానని తెలుసుకుని, వెంటనే తిరుపతి cyber police వారిని సంప్రదించగా NCRP portal ద్వారా compliant register చేయించి, బాధితుడు ఆన్లైన్ లో మోసపోయిన మొత్తం అమౌంట్ రూ. 1,99,870/- లను refund చేయించడం జరిగింది.
పై రెండు మోసాల ద్వారా బాదితులు మోసపోయిన రూ. 3,22,080/-, బాధితులకు సత్వరమే ఇప్పించి వారికి న్యాయం జరిగేందుకు కృషి చేసిన Cyber Police సిబ్బందిని తిరుపతి యస్.పి. శ్రీ వెంకట అప్పల నాయుడు గారు ప్రశంసించారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:

• *అపరచిత ఫోన్ నెంబర్ నుండి వచ్చే link లేదా SMS లను నమ్మకండి*

• *ఎటువంటి linkలను click చేయకండి*

• *మీ యొక్క reward points ను సంబందిత అధికారిక బ్యాంకు app ల ద్వారా redeem చేసుకోవాలి*

• *అపరాచిత వ్యక్తులు మీ యొక్క Debit/Credit card వివరాలు అడిగితే ఇవ్వకండి.*

• *ఎవరైనా మాయమాటలు చెప్పి మోసగిస్తే తక్షణమే Cyber Police వారిని సంప్రదిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తారు.*

*సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు*

Whatsapp 8099999977

NCRP 155260

cybercrime.gov.in

Cyber Mitra 9121211100

About The Author