రేపు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన…


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం పర్యటించనున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురువడంతో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమావేశం కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై కేబినెట్‌ చర్చించింది.

రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్యశాఖ కేబినెట్‌కు నివేదిక సమర్పించింది. ఎలాంటి పరిస్థితైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయంపై చర్చ సాగగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లోని పంటనష్టం జరిగిన గ్రామాల్లో పర్యటన పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎం పర్యటనలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా కేబినెట్‌ వానాకాలం ధాన్యం కొనుగోళ్ల అంశంపై సైతం చర్చించగా.. ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరిందని అధికారులు కేబినెట్‌కు తెలిపారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధాన్యం పూర్తిగా కొనే వరకు కొనుగోలు కేంద్రాల కొనసాగింపునకు కేబినెట్‌ ఆదేశించింది.

About The Author