“కారు” జోరుకూ…”హస్తం” బేజారుకు కు ఇదే కారణమా ?


అది 2014 ఎన్నికల సమయం.అప్పటి దాకా ప్రధాన ప్రతిపక్షమైన “టీడీపీ” ఆంధ్రా పార్టీ అనే ముద్రతో కనుమరగయ్యింది.ఇక తెలంగాణలో హవా రెండు పార్టీలదే అయ్యింది. తెలంగాణ తెచ్చిన ధీమాతో టీఆర్ఎస్,తెలంగాణ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో కాంగ్రెస్ పార్టీలు పోరుకు సిద్ధమయ్యాయి. కాకపోతే టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తామనే హోప్స్ పెద్దగా లేవు. పార్టీ నుంచి కరుడు గట్టిన నేతలూ బరిలో లేరు.దాదాపు అంతా ఉద్యమ కారులే.రాజకీయంపై అవగాహన,అనుభవం లేని వాళ్లే.కాంగ్రెస్ లో మాత్రం అంతా దిగ్గజాలే.రాజకీయాల్లో ఆరితేరిన ఉద్దండులే.కాకపోతే వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్.తెలంగాణ ఇచ్చింది మేమే,తెచ్చింది మేమేనన్న ధీమా.ఈ అతి,అహం పార్టీ కొంప ముంచిందనే సత్యాన్ని ఆలస్యంగా గ్రహించింది కాంగ్రెస్ పార్టీ.టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకెళ్లి ప్రచారం చేస్తే…..కాంగ్రెస్ నేతలు మాత్రం “సీఎం” కుర్చీ కోసం ఢిల్లీలో పైరవీలు చేయడం,అధిష్టాన దూతలను ప్రసన్నం చేసుకోవడమే సరిపోయింది.ప్రచారాలను,ప్రజల ప్రసన్నాలను గాలికొదిలింది.ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకుంది.సీఎం నేనే నని చెప్పుకున్న నేతలంతా వెనిక్కి తిరిగి చూసేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.అది ఎంతలా అంటే ఎనిమిదేళ్లయినా ఇంకా కోలుకోలేనంతగా….కోలుకుంటామన్న నమ్మకం లేనంతగా,ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేనంతగా.
సొంత పార్టీలో అంతా ఓడాలి. కానీ నేను మాత్రం “సీఎం” కావాలి.ఇది కాంగ్రెస్ నేతల సిద్దాంతం కాబోలు.రెండు సార్లు అధికారం కోల్పోయి డీలా పడ్డా ఇంకా వారి వైఖరిలో మార్పు రావడం లేదు.ప్రత్యర్థి పార్టీ నేతల కంటే,సొంత పార్టీ నేతలపైనే విమర్శలు,విసుర్లు ఇంకా మానుకోవడం లేదు.ఉనికి కోల్పోతున్నా చలనం లేదు.మార్పు వస్తుందన్న గ్యారంటీ లేదు.ఆ నమ్మకం ప్రజలకూ అస్సలు లేదు.ఒకవేల గెలిపించినా…అమ్ముడు పోరన్న విశ్వాసం లేనే లేదు.కానీ ఒక్కటి మాత్రం నిజం.రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని “బంగారు పళ్లెం” పెట్టివ్వడానికి ప్రజల కంటే…ఆ పార్టీ శ్రేణులే సర్వ శక్తులూ ఒడ్డుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేయదు.ఫాలో అవుతుంది అంతే.

About The Author