ఓమిక్రాన్ సోకిన వారికి చలి జ్వరం ఎందుకు వస్తుంది ?
ఓమిక్రాన్ సోకిన వారిలో కొంత మందికి జ్వరం, దానితో పాటే చలి , చిల్స్ అంటే వణుకు వస్తోంది . ఎందుకిలా ?
బాగా చలి వున్న సమయం లో ఉన్ని దుస్తులు ధరించకుండా బయటకు వెళితే చలి వేస్తుంది . ఆ చలి వల్ల వణుకు రావడాన్ని చూసి వుంటారు . మరి జ్వరం వచ్చినప్పుడు అంటే శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, వణుకు ఎందుకు వస్తుంది ? ఎందుకు చలి వేస్తుంది ? చలి వల్ల వణుకు వచ్చేటట్టు అయితే జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఎందుకు చలి వేసి వణుకు పుడుతుంది ?
వెన్నెముక కలిగిన జీవులు స్థూలంగా రెండు రకాలు . ఒకటి శీతల రక్తం కలిగిన జంతువులు. ఉదాహరణ చేపలు , కప్పలు , తొండ, బల్లి మొదలైనవి . వీటి శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు . వాతావరణ ఉష్ణోగ్రత బట్టి మారుతూ ఉంటుంది .
ఇక రెండవ తరహా జంతువులు .. స్థిర శరీర ఉష్ణోగ్రత కలిగిన జంతువులు . పాలిచ్చి పిల్లల్ని పోషించే జంతువులు ఈ కోవ లోకి వస్తాయి . మనిషి కూడా క్షీరదమే. అంటే మనిషి శరీర ఉష్ణోగ్రత మామూలు పరిస్థితి లో స్థిరంగా ఉంటుంది . ఉండాలి . ఆ ఉష్ణోగ్రత 98.6 F
మనిషి శరీర నిర్మాణం ఎలా ఉందంటే ఈ స్థిర ఉష్ణోగ్రత ను శరీరం మైంటైన్ చెయ్యాలి . ఇది బాగా పెరిగినా కష్టమే . తగ్గినా నష్టమే !
స్థిరంగా ఎలా మైంటైన్ అవుతుంది ?
మీరు బాగా చలిగా వున్న , మంచు కురుస్తున్న కులు- మనాలి, కెనడా లాంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి . అక్కడ బయట ఉష్ణోగ్రత సున్న డిగ్రీ లు సెల్సియస్ లేదా అంతకన్నా తక్కువ గా ఉంటుంది . మన శరీరం 37 డిగ్రీ ల సెంటీగ్రేడ్ లేదా పైన చెప్పినట్టు 98.6 F ఉండాలి . ఇది ఎలా సాధ్యం ?
స్థిర శరీర ఉష్ణోగ్రత మైంటైన్ చేసుకొనేలా మన శరీర నిర్మాణం ఉంది. ఇందులో కీలక పాత్ర పోషించేది మెదడు కింది భాగం లోని హైపోతలామస్ అనే గ్రంధి . మీరు ఉన్ని దుస్తులు ధరించకుండా మంచు లోకి వెళ్లారు . ఆ చలికి మీ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ నుంచి పడిపోవడం మొదలైతే ? ఆలా జరిగితే ప్రాణం పోతుంది . కాబట్టి హైపోథలామస్ రంగం లోకి దిగుతుంది . శరీరం లో వణుకు పుట్టిస్తుంది . ఇది అసంకల్పిత చర్య . అంటే మీరు అనుకొని చేసేది కాదు . శరీరం దానికంతటికి అదే చేస్తుంది . మీరు ఆగమంటే ఆగేది కాదు .
వణుకు ఎందుకు ?
చిల్స్ లేదా వణుకు అంటే శరీర కండరాలు వేగం గా వ్యాకోచించడం వెంటనే సంకోచించడం . ఆలా కండరాల వ్యాకోచ సంకోచాల ద్వారా వేడి పుడుతుంది . ఆ విధంగా మన శరీరం స్థిర ఉష్ణోగ్రత ను కాపాడుకుంటుంది . అంటే బయట చలిగా ఉన్నా, మన ఒంట్లొ వేడి ఉంటుంది . చలి చలిగా ఉంది రా ఓయ్ రామ ఓయ్ రామ .. వేడి వేడి కౌగిలింత కోరింది .. అనే పాత సినిమా పాట గుర్తుంది కదా ?
జ్వరం ఎందుకు ?
జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత పెరగడం . టెంపరేచర్ చెక్ చేసుకొని నాకు 100 , 102 డిగ్రీ లు ఉంది .. ఒళ్ళు బాగా కాలిపోతుంది అంటుంటారు . శరీర ఉషోగ్రత ఎందుకు పెరుగుతుంది ?
శరీర ఉష్ణోగ్రత పెరగడానికి ఒక ప్రధాన కారణం ఇన్ఫెక్షన్ . మీ శరీరం లోకి వైరస్ లేదా హానికారక బాక్టీరియా ప్రవేశించింది . ఇప్పుడు మీ ఇమ్మ్యూనిటి వ్యవస్థ కు ఆ వ్యాధి కారక జీవి కి మధ్య యుద్ధం మొదలైయింది . ఈ యుద్ధం వల్ల పుట్టిందే ఈ వేడి . ఇంకా సరిగా చెప్పాలి అంటే శరీరం తన ఉష్ణోగ్రత పెంచుకోవడం ద్వారా హానికారక సూక్ష్మ జీవి ని బలహీన పరచి చంపడానికి ప్రయత్నం చేస్తుంది .
ఎప్పుడైతే హానికారక జీవి తో యుద్ధం మొదలైందో అప్పుడు హైపోథలామస్ తనంతకు తానూ రంగం లో దిగి శరీరం లో వణుకు పుట్టిస్తుంది . కండరాలు వేగం గా కొట్టుకొంటాయి . ఈ సంకోచ వ్యాకోచాలు వేడిని పుట్టిస్తాయి . అంటే చలి .. వణుకు .. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది . ఇలా పెరిగిన ఉష్ణోగ్రత వైరస్ ను చంపడానికి ఇమ్మ్యూనిటి వ్యవస్థ కు సహకరిస్తుంది .
అందుకే ఓమిక్రాన్ లాంటి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు పార్రంభం లో చలి .. వణుకు .. జ్వరం వస్తాయి .
అర్థం అయ్యింది కదా ? జ్వరం అనేది రోగం కాదు . రోగాన్ని నిలువరించే ప్రక్రియ లో భాగం . రోగానికి సూచిక .
ఇక్కడో ముఖ్యమైన పాయింట్ . శరీర ఉష్ణోగ్రత 102 దాక పెరిగితే ఫరవా లేదు . కానీ మరీ ఎక్కువైతే ప్రమాదం . వైరస్ లాంటి హానికారక జీవితో మీ ఇమ్మ్యూనిటి వ్యవస్థ పోరాటం చేస్తోంది . భీకర యుద్ధం సాగుతోంది . వేడి మరీ ఎక్కువయ్యి 103 దాటితే మరో ప్రమాదం .. ఫీట్స్ రావొచ్చు . అందుకే శరీర ఉష్ణోగ్రత 102 కంటే ఎక్కువైతే తడి బట్ట తో శరీరాన్ని తుడవాలి . ఆలా ఉష్ణోగ్రత ను మరీ పెరగకుండా తగ్గించాలి .
మరి జ్వరం వచ్చాక చెమటలు ఎందుకు పడుతాయి ?
బాగా గుర్తు పెట్టుకోండి . యుద్ధం మొదలయినప్పుడు వేడి పుట్టాలి .. అందుకే వణుకు .. చలి .. ఇప్పుడు యుద్ధం అయిపొయింది . శత్రువు అదే ఓమిక్రాన్ చచ్చింది . ఇంకా ఎక్కువ వేడి ఉంటే ఎలా ? అప్పుడు మళ్ళీ మెదడు లోని ఆ హైపోథలామస్ గ్రంధి రంగం లోకి దిగుతుంది . చెమటలు పట్టించడం ద్వారా మన ఒంట్లోని అధిక వేడిని తగ్గిస్తుంది . నార్మల్ టెంపరేచర్ వచ్చేలా చేస్తుంది . వేసవి కాలం లో కొత్త కుండ లో నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయి ? కొత్త కుండకు చెమట .. చెమట అంటే నిజమైన చెమట కాదు లెండి . కుండ లోని చిన్న రంద్రాల గుండా నీరు బయటకు పోతుంది . కొత్త కుండ బయట భాగం లో చుట్టూరా చెమ్మ చూసారు కదా ? ఈ చెమట కానీ చెమట వల్ల కుండ లో నీరు ఎలా చల్ల బడుతుందో అలాగే మన శరీరం చెమట ద్వారా మన బాడీ టెంపరేచర్ ను సాధారణ స్థితి కి తెస్తుంది .
అంటే ఓమిక్రాన్ సోకినప్పుడు .. యుద్ధం మొదలయినప్పుడు ప్రారంభం లో చలి .. వణుకు .. ఆ వెంటనే జ్వరం .. ఇక యుద్ధం ముగిసింది అంటే చెమటలు .. అర్థం అయ్యింది కదా ?
చూసారా ? ప్రకృతి ఎంత అద్భుతమైన ఏర్పాటు చేసిందో !
{ చలి జ్వరం చెమట రాకుంటే ? అయ్యో నాకు పాజిటివ్ వచ్చింది . జ్వరం రాలేదు .అసలు లక్షణాలు లేవు . లేదా కేవలం జలుబు ఉంది .. చలి జ్వరం లేదు .. చెమటలు లేవు .. అంటే నా శరీరం వైరస్ ను ఎదిరించడం లేదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు . మీ ఇమ్మ్యూనిటి బాహుబలి . వచ్చింది బక్క పీనుగ లాంటి శత్రువు . యుద్ధం లేదు .. శబ్దం లేదు . చచ్చి ఊరుకొంటుంది ఆ శత్రువు .దాని ఖేల్ ఖతం అంటే ఆటకట్టు .. దుకాణ్ బంద్ .. అంటే తన దుకాణాన్ని అది సర్దుకొన్నట్టే . మీ బాహుబలి ఇమ్మ్యూనిటి కి సాహూ అనండి }
మీ ఇంట్లో కుక్క లాంటి జంతువు ఉందా ? దానికి ఒంట్లొ బాగాలేనప్పుడు అది తిండి తినదు . పడుకొన్న చోటు నుంచి ఒకటి రెండు రోజులు లేవదు . గమనించారా ? ఎందుకో ఆలోచించారా ?
లంఖణం .. అంటే తిండి తినక పోవడం . పాత రోజుల్లో డాక్టర్ లు జ్వరం వచ్చిన రోగులకు లంఖణం చేయమని చెప్పేవారట . లేదా బ్రెడ్ లాంటి సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోమని చెప్పేవారు . ఎందుకు ? ఆహారం జీర్ణం కావాలి అంటే శక్తి కావాలి . ఉష్ణం కావాలి . శరీరం సూక్ష్మ జీవితో యుధం చేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకొంటే ఆ విధంగా ఆదా అయిన అదనపు శక్తిని అదే విధంగా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం లేదా లంఖణం చెయ్యడం ద్వారా ఆదా అయ్యే అదనపు శక్తిని ఇమ్మ్యూనిటి కి ఇస్తున్నట్టు . అంటే ఇమ్మ్యూనిటి వ్యవస్థ త్వరగా యుద్ధం చేసి విజయం సాధించడానికి మనం సహకారం చేస్తున్నట్టు .
చదువు సంధ్య లేని కుక్క లాంటి జంతువుకు ఇది సహాజిత ప్రవర్తన గా వచ్చేస్తుంది . దానికి తెలియకుండానే అది విశ్రాంతి తీసుకోవడం ఒకటి రెండు పూటలు తిండి తినక పోవడం ద్వారా రోగాన్ని జయించేందుకు తన శరీరానికి సహకరిస్తుంది .
ఈ సూత్రాన్ని పాత రోజుల్లో పాటించేవారు . ఇప్పుడంతా మందులు దారి . బీపీ నా ? టాబ్లెట్ వేసుకో . షుగర్ ప్రాబ్లెమ్ ? జస్ట్ సింపుల్ .. టాబ్లెట్ వేసుకో .. చస్తూ బతుకుతున్న మనుషులు . పండగ చేసుకొంటున్న ఫార్మాసురులు.
ఆ రోజుల్లో మనుషుల కోసం మందులు .. ఇప్పుడేమో మందుల కోసం మనుషులు . విజ్ఞాన శాస్త్రం ఫార్మసురుల కోసం కాకుండా సాధారణ ప్రజల కోసం వినిగించే రోజులు తిరిగి రావాలని కోరుకొందాము.
సంతులిత ఆహారం .. సరైన అలవాట్లు .. పాజిటివ్ ఫీలింగ్స్ .. ఇవీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి . వీటి తో సరిపోకుంటే అప్పుడు తప్పకుండా మందులు కావాలి . అల్లోపతి అద్భుత విజ్ఞాన శాస్త్రం . దాన్ని మనం వియోగించుకొనే తీరు మారాలి . మందులు చివరి అస్త్రం కావాలి . ఇదే ప్రజా విజ్ఞానం .
ఓమిక్రాన్ సోకి చలి జ్వరం ఉంటే భయపడొద్దు .
1 . ఒకటి రెండు పూటలు తిండి లేకుండా లంఖణం ఉంటే మంచిది . లేదా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోండి . ఆహారం తీసుకోక లంఖణం చేసినా నీరు .. తప్పని సరిగా తాగాలి . పెద్దలు రోజుకు నాలుగు లీటర్ లు .. పిల్లలు రెండు లీటర్ లు .. వేడి నీరు అయితే మంచిది
2 . కనీసం ఒక రోజు విశ్రాంతి తీసుకోండి .
3 . చలి వేసినప్పుడు వదులుగా వుండే నూలు దుస్తులు .. ఒక దాని పై ఒకటి – రెండు.. వేసుకొంటే బాగుంటుంది .
4 . ఆరు బయట తిరగొద్దు . కిటికీలు మూసి { కొద్దీ పాటి గాలి వచ్చేలా } రెండు సన్నని దుప్పట్లు కప్పుకొని కొన్ని గంటలు పడుకోండి . చెమటలు పట్టడం మొదలైతే దుప్పటి తీసెయ్యండి .
5 . శరీర ఉష్ణోగ్రత 102 దాటితే తడిబట్ట తో ఒంటిని తుడవండి.
6 . ఆరోగ్యం బాగాలేనప్పుడు మంచి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది . సుబ్బ లక్ష్మి అమ్మగారి విష్ణు సహస్ర నామం , భజగోవిందం యూట్యూబ్ ద్వారా ప్లే చేసి { మంద్ర స్థాయిలో } వింటూ నిద్ర పోండి. ఒక్క సారి ప్రయత్నించండి . తేడా గమనించండి.
ఈ సందేశాన్ని నలుగురితో పంచుకోండి . సరైన అవగాహన కల్పించేందుకు మీ వంతు పాత్ర పోషించండి. అదే ఆరోగ్యానికి మొదటి మెట్టు.