నేను ఇసుక దొంగతనం చేసాను అని తప్పుడు కూతలు కూస్తే మూతి పళ్లు రాలుతాయ్..ఎమ్మెల్యే ఆర్‌కే రోజా


నేను ఇసుక దొంగతనం చేసాను అని తప్పుడు కూతలు కూస్తే మూతి పళ్లు రాలుతాయ్..ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

నేను ఇసుక దొంగతనం చేసాను అని తప్పుడు కూతలు కూస్తే మూతి పళ్లు రాలుతాయ్.. ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
పనికిమాలిన వాడు గాలి భానుప్రకాష్‌ మాట్లాడిన ప్రతి మాట రాయడం మంచిది కాదు..

అవినీతిపరుడైన గాలి భానుప్రకాష్‌

అవినీతిపరుడైన గాలి భానుప్రకాష్‌కు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు. తాను నంబర్‌వన్‌ హీరోయిన్‌గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. వైఎస్సార్‌సీపీలోకి రాకముందు హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని ఇల్లు కట్టుకుట్టున్నట్టు వెల్లడించారు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.

ప్రతి ఒక్కటీ తన సొంత డబ్బుతో కట్టిందేనన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు.

గాలి భానుప్రకాష్‌ కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు..

గాలి భానుప్రకాష్‌ కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని ఆయన తల్లి, తమ్ముడు అసహ్యించుకుంటున్నారని, ముందు వారి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకోవాలన్నారు. తన సొంత ఇంటిలోనే అతనికి మంచి పేరులేదని, ఇంట గెలవలేని ఈయన రచ్చ ఎలా గెలుస్తాడన్నారు.

రాజీనామా అవాస్తవం

సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు.

About The Author