అగ్రి ఇన్‌ఫ్రాపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష..

అగ్రి ఇన్‌ఫ్రాపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..

♦ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి
♦సాధ్యమైనంత త్వరగా వాటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలి
♦తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలి
♦క్షేత్రస్థాయిలో కచ్చితంగా మార్పు కనిపించాలి
♦గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలి
♦ప్రపంచంలో ఇప్పుడు సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలద్వారా వచ్చిన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది
♦ఈ అవకాశాలను మన రైతులు సద్వినియోగం చేసుకోవాలి
♦ప్రతి ఆర్బీకే స్థాయిలో సేంద్రీయ వ్యవసాయం మీద ఒక కస్టం హైర్‌ సెంటర్‌ రావాలన్న సీఎం
♦రైతుల్లో అవగాహన పెంచాలన్న సీఎం
♦వచ్చే ఏడాది నాటికి తీసుకు వచ్చేలా ఒక ప్రణాళిక వేసుకోవాలన్న సీఎం
♦సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు ఏంకావాలో నిర్ణయించి.. ఆ మేరకు ప్రతి ఆర్బీకే స్థాయిలో ఏర్పాటు చేయాలన్న సీఎం
♦సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే వాటికి మంచి రేటు వచ్చేలా చూడాలని, అలాంటి ఉత్పత్తులు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేలా ఒక విధానం తీసుకురావాలన్న సీఎం

గోదాముల నిర్మాణం

♦గోడౌన్ల నిర్మాణానికి జిల్లాల్లో దాదాపుగా స్థల సేకరణ పూర్తయ్యిందని, 1165 చోట్ల గోడౌన్లు నిర్మిస్తున్నామని తెలిపిన అధికారులు
♦ఇప్పటికే చాలాచోట్ల పనులు మొదలుపెట్టామని తెలిపిన అధికారులు
♦278 చోట్ల గోడౌన్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిపిన అధికారులు
♦రైతులు మోసాలకు గురికాకుండా బరువును, తేమను కొలిచే పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపిన అధికారులు
♦ప్రొక్యూర్‌ మెంట్‌లో వినియోగించే 6,293 పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్న అధికారులు
♦వైఎస్సార్‌ యంత్రసేవా కింద రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్న వ్యవసాయ యంత్రాలు, పనిముట్లూ, పరికరాలపైనా ముఖ్యమంత్రి సమీక్ష.
♦ఇప్పటికే 3,497 యూనిట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్న అధికారులు.

ప్రాససింగ్‌ యూనిట్లు:

♦పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా మొత్తంగా 33 చోట్ల విత్తనాలు, మరియు మిల్లెట్‌ ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు ఏర్పాటు
♦ఖరీఫ్‌ 2022 నుంచి అందుబాటులోకి ఈ ప్రాససింగ్‌సెంటర్లు.
♦విత్తన శుద్ధి, మరియు ప్రాససింగ్‌సెంటర్లు రెండు రకాలుగా ఉపయోగపడనున్న యూనిట్లు.
♦చిరుధాన్యాలు, పప్పు దినుసులు సాగుచేస్తున్న రైతులు ఈ యూనిట్లను చక్కగా వినియోగించుకోవచ్చన్న అధికారులు.
♦ప్రాసస్‌ చేయడంవల్ల రైతులకు మంచి ధరలు లభిస్తాయని, నాణ్యమైన ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపిన అధికారులు.
♦సెకండరీ ప్రాససింగ్‌ చేసే వాళ్లకు, సంబం«ధిత వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ముడిపదార్థాలు లభిస్తాయన్న అధికారులు.

సెకండరీ ప్రాససింగ్‌ యూనిట్లపైనా సీఎం సమీక్ష

♦13 యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందన్న అధికారులు.
♦ఉద్యానవన పంటలు సాగుచేస్తున్న రైతులకూ అందుబాటులో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటు పనులపై సీఎం సమీక్ష.

పశుసంవర్ధకశాఖపైనా సీఎం సమీక్ష

♦పశువులు కోసం 175 అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు తెలిపిన అధికారులు
♦నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు
♦మార్చి నెలలలో ప్రారంభం కానున్న అంబులెన్స్‌లు

జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్నీ సమీక్షించిన సీఎం

♦దాదాపు 1100 గ్రామాల్లో పాల సేకరణ చేస్తున్నట్టు తెలిపిన అధికారులు
♦నెలకు 28,00,502 లీటర్లకుపైగా పాలను సేకరిస్తున్నట్టు తెలిపిన అధికారులు
♦ఇప్పటివరకూ 2.03 కోట్ల లీటర్లకుపైగా సేకరణ
♦ఇప్పటివరకూ రైతులకు రూ.86.58 కోట్ల చెల్లింపులు. రైతులకు అదనపు లబ్ధి రూ.14.68కోట్లు
♦అమూల్‌ప్రవేశంతో ఇతర డైరీలు తప్పకుండా ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందన్న అధికారులు
♦తూనికల్లో తేడాలు, ఫాట్‌ నిర్దారణలో తప్పిదాలకు పాల్పడుతున్నవారిపై కేసులు బుక్‌చేశామని తెలిపిన అధికారులు
♦రైతులు మోసాలకు గురికాకుండా అడ్డుకుంటున్నామని తెలిపిన అధికారులు
♦గేదెపాలలో ఒక శాతం తేడాచూపితే రైతుకు దాదాపు రూ.7ల నష్టం వస్తోందన్న అధికారులు

బీఎంసీ, ఏంఎసీల ప్రగతిని సమీక్షించిన అధికారులు

♦వచ్చే నెలలో విశాఖపట్నం జిల్లాలో అమూల్‌ పాలసేకరణ ప్రారంభం
♦చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో పాల ఉత్పత్తుల యూనిట్లను ప్రారంభించనున్న అమూల్‌
♦ఆక్వారంగంలో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులను సమీక్షించిన సీఎం
♦ఆక్వాహబ్‌లు, స్పోక్స్‌ ద్వారా భారీగా ఉపాధి కల్పన చేస్తున్నట్టు తెలిపిన అధికారులు
♦దాదాపు 80వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగుతోందని తెలిపిన అధికారులు
♦స్థానికంగా వినియోగం పెరిగే అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపిన అధికారులు
♦జూన్‌ నాటికి 70 ఆక్వాహబ్‌లు, 14వేల స్పోక్స్‌ ఏర్పాటు దిశగా సాగుతున్నట్టు తెలిపిన అధికారులు
♦23 ప్రీ ప్రాససింగ్‌ ప్లాంట్లు, 10 ప్రాససింగ్‌ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపిన అధికారులు
♦వీటికి సంబంధించి ఇప్పటికే 9 సొసైటీలను ఏర్పాటు చేశామన్న అధికారులు

ఫిషింగ్‌ హార్భర్లపై సీఎం సమీక్ష

♦మొదటి విడతలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నంల్లో ఫిషింగ్‌ హార్బర్ల పని సాగుతోందని తెలిపిన అధికారులు
♦ఉప్పాడల్లో కూడా పనులు వేగవంతం చేస్తామన్న అధికారులు
♦నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తామన్న అధికారులు
♦రెండో విడతలో పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నంలో పనులు చేపడుతున్నామన్న అధికారులు
♦ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు

About The Author