శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం .. ఏడవ రోజు Live

శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం .. ఏడవ రోజు || Live @9Staar Tv

రామానుజాచార్యులు.. వెయ్యేళ్ల కిందటే పరమాత్ముడి దృష్టిలో అందరూ సమానులే. మోక్షానికి అందరూ అర్హులే అంటూ సర్వ మానవ సమానత్వ భావాన్ని బోధించారు సకల మానవళి మేలు కోసం విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు.

ఓం నమో నారాయణాయ అనే మంత్ర బీజాక్షరానికి ఆద్యుడు రామానుజులే.

దేశంలోనే అనేక ఆలయాల్లో పూజా విధానాలకు రూపకర్త రామానుజాచార్యులు ..
పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వెయ్యేళ్ల కిందటే చాటి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథస్వామి వారి పుణ్యక్షేత్రం సహా- దేశంలోనే అనేక ఆలయాల్లో పూజా విధానాలకు రూపకర్తగా నిలిచారు. పూజా విధానాలను చాటి చెప్పారు. వైష్ణవ సంప్రదాయానికి రామానుజాచార్యులు ఆద్యులు. తన జీవితకాలంలో పలుమార్లు ఆయన తిరుమలను సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.

120 సంవత్సరాల పాటు
తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 1,017వ సంవత్సరంలో జన్మించారు. 120 సంవత్సరాల పాటు జీవించారు. 1,137 వ సంవత్సరం మాఘ శుద్ధ దశమి నాడు పరమపదించారు. దేశం మొత్తం పర్యటించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం వెయ్యేళ్ల కిందటే బోధనలు చేశారు. తమిళనాడులోని కాంచీపురం, శ్రీరంగంలో ఎక్కువ భాగం గడిపారు. అన్నమాచార్యులు, భక్త రామదాసు, త్యాగరాజస్వామి, భక్త కబీర్, మీరాబాయి వంటి తాత్వికులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

భూమి మీద జీవించే ప్రతి ఒక్కరూ సమానమేనని చాటి చెప్పిన రామానుజాచార్యులు
నరనరాల్లో జీర్ణించుకుపోయి వర్ణ వివక్షతను రూపుమాపే దిశగా సమాజాన్ని చైతన్య పరిచారు. మనుషుల మధ్య అధికులం, అధమత్వం అనే తేడాలను నిర్మూలించేలా బోధనలు చేశారు. కులాధిపత్య భావజాలం, జాఢ్యాన్ని తుడిచి పెట్టారు. మనుషుల మధ్య అంతరం, వివక్షలను తొలగించడానికి కంకణ బద్దుడయ్యారు. మనుషులంతా సమానులే అని చాటి చెప్పారు. దేశం అంతా విస్తృత ప్రచారం చేసారు.

About The Author