నిరుద్యోగులను ఆదుకోని ముఖ్యమంత్రి మనకెందుకు? వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

నిరుద్యోగులను ఆదుకోని ముఖ్యమంత్రి మనకెందుకు? వైఎస్ షర్మిల @9Staar Tv
నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లో చలనం రావడం లేదు… వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ లో చలనం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకొద్దన్నారు. తక్షణం కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ ఇవాళ మధ్యాహ్నం ఆమె.. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం టీఎస్పీఎస్సీ ఆఫీసు ఎదుటనే ఆమె ధర్నాకు దిగారు. ఆమె ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆమె స్టేషన్‌లోనూ తన ధర్నాను కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే.. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
దళితుడిని సీఎం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ లో చలనం లేదన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కనిపించే మన సీఎం కేసీఆర్ కు తెలంగాణలోని నిరుద్యోగం కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను అడిగితే ఉద్యోగాల భర్తీపై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్తున్నారంటేనే నిరుద్యోగ సమస్యపై కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని అన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..

About The Author