మీ దర్శకత్వంలో నటించటం అదృష్టం: చిరంజీవి


మెగాస్టార్‌ చిరంజీవి కళాతపస్వీ కె.విశ్వనాథ్‌కు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వెలకట్టలేని ఆణిముత్యాలాంటి సినిమాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత ఆయనది.

కె.విశ్వనాథ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని కళాతపస్వీతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి విషెస్‌ తెలిపారు చిరంజీవి. ”గురు తుల్యులు,, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తె?నిగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వం లో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను” అంటూ విశ్వనాథ్‌ పై ప్రేమను చాటుకున్నారు చిరంజీవి. ఆయన హీరోగా కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘శుభలేఖ’, ఆపద్భాందవుడు’, ‘స్వయంకృషి’ వంటి సూపర్‌మిట్‌ చిత్రాల్లో నటించారు.

About The Author