శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో వెలసిన సహజ శిల వినాయకుడు


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్త కన్నప్ప ధ్వజారోహణంలో కన్నప్ప కొండపై సహజ శిలా రూపంలో వెలసిన విఘ్నేశ్వరుడు.

భక్త కన్నప్ప ధ్వజారోహణం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ఒక బాలుడు సహజ శిలగా వెలసిన వినాయకుని చూపించడంతో అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే గారు సహజ శిలా వినాయకుడిని చూసి ఆశ్చర్యానికిలోనయ్యారు. హుటాహుటిన అక్కడ ఉన్న అర్చకులు, ఆలయ సిబ్బంది కి ఈ విషయాన్ని వెంటనే తెలియజేసి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల సంతానమైన వినాయకుడు శ్రీకాళహస్తి భక్త కన్నప్ప కొండ పై సహజ శిలారూపం గా దర్శనమివ్వడం శుభపరిణామం అన్నారు.ఆధ్యాత్మిక కేంద్రానికి ఈ దృశ్యమే ఓ ఉదాహరణ అంటూ భక్తులు అందరూ సహజ విగ్నేశ్వరుని దర్శించుకోవాలని కోరారు.

About The Author