సోమనాథ్ ఆలయంలో “బాణ స్తభం”…
ఇది గుజరాత్‌లోని పురాతన సోమనాథ్ ఆలయంలో “బాణ స్తభం”…
సోమనాథ్ దేవాలయానికి దక్షిణం వైపున, సముద్రానికి అభిముఖంగా, “బాణ స్తభం” అనే స్తంభం ఉంది. సముద్రం వైపు చూపే స్తంభం పైభాగంలో ఒక బాణం నిర్మించబడింది. 6వ శతాబ్దానికి చెందిన కొన్ని పురాతన పుస్తకాలలో ఈ స్తంభం ఉనికి గురించి ప్రస్తావించబడింది.
స్తంభంపై సంస్కృతంలో చెక్కబడిన శాసనం..
“ఆసముద్రాంత దక్షిణ ధ్రువ,పర్యంత అబాధిత జ్యోతిమార్గం”.
“సముద్రం యొక్క ఈ పాయింట్ నుండి దక్షిణ ధ్రువం వరకు భూమి భూభాగం లేదు.
మనం సోమనాథ్ మందిరం నుండి దక్షిణం వైపు ప్రయాణించడం మొదలుపెడితే, అంటార్కిటికాలోని దక్షిణ ధృవానికి చేరుకునే వరకు నిజంగా పర్వతం లేదా భూమి కనిపించదు.
దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న భూమి దాదాపు 10,000 కి.మీ దూరంలో ఉంటుంది.
నిజంగా అద్భుతం కదా!!
ఇంతకీ రహస్యం ఏమిటంటే..
6వ శతాబ్దంలో వారికి ఈ వాస్తవం ఎలా తెలిసింది?
అప్పటి వారి వద్ద భూమి యొక్క వైమానిక మ్యాప్ ఉండిందా!? ఉండే అవకాశమే లేదు..
మరి ఖగోళ శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, గణితం లేదా సముద్ర శాస్త్రాలలో వారికి ఏ స్థాయి జ్ఞానం ఉంది?
అదే సనాతన ధర్మంలో ఉన్న విశిష్ట వైభవ రహస్యం..
ఇప్పటి ఆధునాతన టెక్నాలజీ మన సనాతన ధర్మానికి రవ్వంత కూడా సరితూగవు..