ఆంధ్ర ప్రదేశ్ ని తాకిన రుతుపవనాలు…
ఆంధ్ర ప్రదేశ్ :
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తొలుత జూన్ 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా ముందుగానే రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి.