అమరావతి పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం –


రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది

పది నెలల్లోనే పట్టాలెక్కిన ప్రగతి ..

జగన్‌ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపేసి భౌతికంగా చేసిన నష్టం కంటే, అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చేసిన నష్టం చాలా తీవ్రమైంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించింది.

రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టేలా రూ.77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది.

రూ.49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది.

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది.

ప్రపంచబ్యాంకు, ఏడీబీలను ఒప్పించి ఆఘమేఘాలపై రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. హడ్కో మరో రూ.11 వేల కోట్ల రుణం మంజూరు చేసింది.

రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర రైల్వే లైన్‌ నిర్మాణానికి రైల్వే బోర్డు రూ.2,047 కోట్లు మంజూరు చేసింది.

189.4 కి.మీ. పొడవున అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డును రూ.16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం
ఆమోదించింది. భూసేకరణ ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
ఎల్‌అండ్‌టీ సంస్థ ఐటీ టవర్‌ నిర్మించబోతోంది.

ఐబీఎం, టీసీఎస్, ఎల్‌ అండ్‌ టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రభుత్వం సీఐఐతో కలసి గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.

రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ నెలకొల్పనుంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐడీ త్వరలో పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభించనుంది.

అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

రాష్ట్రానికి నడిబొడ్డున, అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతిని నిర్మిస్తూనే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్ని ఏకకాలంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. విద్యా సంస్థలు, పరిశ్రమల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది.

అమరావతితో పాటు, విశాఖ, తిరుపతిలను మెగాసిటీలుగా అభివృద్ధి చేయనుంది.

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తోంది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తోంది.

రాయలసీమను ఆటోమొబైల్‌ జోన్‌గా ప్రకటించింది.

About The Author