HOP on HOP off అంటే ఏమిటీ అర్థం..


నిన్న ఈ ఫోటోలో HOP on HOP off అనే వర్డ్స్ చూడగానే ఏంటిది, ఎవరన్నా స్పాన్సర్ పేరేమో అనుకున్నా !!

మళ్ళీ గుర్తొచ్చి… ఇవాళ తీరిగ్గా గూగుల్ చేశా !

“Hop on – Hop off” అనేది ప్రధానంగా టూరిస్టు బస్సులు లేదా సిటి సైట్ సీయింగ్ సర్వీసుల్లో వాడే పదం అని తెలిసింది !

ఒకే టికెట్ కొనుగోలు చేసి, మీరు ఒక బస్సు/టూరిస్టు వాహనంలో ఎక్కడైనా ఎక్కవచ్చు (hop on)

అలాగే మీకు నచ్చిన స్టాప్ దగ్గర దిగవచ్చు (hop off).

ఉదాహరణకు:
విశాఖ నగరంలో 15 ఆకర్షణీయమైన టూరిస్టు ప్రదేశాలు (మ్యూజియంలు, పార్కులు, మ్యూమెంట్లు వంటివి) ఉంటే – “Hop on Hop off” బస్సు ఆ 15 ప్రదేశాల దగ్గర ఆగుతుంది.

మీరు ఒక స్టాప్ వద్ద దిగి (hop off) ఆ ప్రదేశాన్ని చూసి…

తర్వాత మళ్లీ అదే కంపెనీకి చెందిన తరువాత వచ్చే బస్సులో ఎక్కి (hop on) మీ టూర్ కొనసాగించవచ్చు !

✔️ అంటే ఇది ఫ్లెక్సిబుల్ టూరిజం సర్వీస్, మీరు మీకు నచ్చినట్టుగా టైం తీసుకుని ఆయా ప్రదేశాలు చూడొచ్చు, మళ్లీ అదే టూర్ బస్సులో ఎక్కి ప్రయాణం కొనసాగించొచ్చు !!

About The Author