ఒక మాట గుర్తుంచుకోండి…


ఒక మాట గుర్తుంచుకోండి – అసలు బలం అంటే గట్టిగా అరవడంలో లేదు… కత్తి కన్నా పదునైన మౌనంలో ఉంది. ఎదుటివాడు అహంకారంగా, అజ్ఞానంగా ప్రవర్తిస్తే వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఉపేక్షే అతడికి గట్టిపాఠం చెబుతుంది.

ఎవరు ఎగతాళి చేసినా, ఎవరెంన్ని పనికిమాలిన మాటలు మాట్లాడినా వెంటనే ప్రతిస్పందించడం మేధావుల పనే కాదు. కొన్నిసార్లు ఉపేక్షే అత్యంత కఠినమైన శిక్షగా మారుతుంది. ఇదే సిద్ధాంతాన్ని భారత్ అనుసరిస్తోంది. శత్రువు దాడి చేస్తే నోరు కాదు..చర్యలతో సమాధానం ఇస్తోంది.

భారత్‌కి అమెరికా లాంటి అగ్రదేశానికి ‘NO’ చెప్పే శక్తి ఉంది. అదే సమయంలో చైనా లాంటి శత్రువుని కూడా చర్చల బల్ల మీద కూర్చోబెట్టే నైపుణ్యం ఉంది. ప్రపంచంలో 193 దేశాలతోనూ మిత్రత్వం కొనసాగించగలిగే శక్తి ఒక్క భారత్‌దే…

డొక్లామ్, గల్వాన్ ఘటనలలో భారత్ ఘాటైన సమాధానం ఇచ్చింది.
కానీ “చైనా పేరు ఎందుకు చెప్పలేదని” అడిగిన నాయకులు మరచిపోయిన నిజం ఒక్కటే – పేరు కాదు, పని ముఖ్యం. మోడీ మాటలతో కాదు, చర్యలతో జవాబు ఇచ్చారు…

టారిఫ్ సమస్యల సమయంలో భారత్ 50–60 దేశాలతో కొత్త వాణిజ్య మార్గాలు తెరిచింది. పుతిన్‌తో, జిన్‌పింగ్‌తో సమావేశాలు జరిపింది. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో మాత్రం ఒక్కసారైనా మాట్లాడలేదు. ట్రంప్ నాలుగుసార్లు ఫోన్ చేసినా పని మీద ఉన్నానని చెప్పి పట్టించుకోలేదు…
ఇక్కడ ఉపేక్షే ఆయుధమై, అదే సమాధానమైంది. చివరికి ట్రంప్‌ స్వయంగా “మోడీని కోల్పోవడం తప్పు” అని ఒప్పుకోవాల్సి వచ్చింది…

ఇప్పుడు ప్రపంచం ముందున్న భారత్ ఉదయించే శక్తి కాదు….స్థిరంగా ఉండే శక్తి. అభివృద్ధి చెందిన దేశం కావడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది.

ఇలా అనగానే ఇప్పుడు మీరు రెడీ గా ఉంటారు..దేశంలోని చిన్న చిన్న గొడవలు పెద్ద సమస్యలు గా చేసి వితండవాదం చెయ్యాలని…కానీ..ఈ మార్పును దేశంలోని చిన్న రాజకీయ గొడవలతో పోల్చడం అన్యాయం.
తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన తీర్పు ఇస్తారు.

ఇప్పుడు ప్రతీ పౌరుడికి కావాల్సింది దేశభక్తి…
ప్రత్యేకంగా ఓ నాయకుడికి భక్తులు కావలసిన అవసరం లేదు.అలాగే ఈ సమయం లో దేశానికి అంధభక్తులం అని చెప్పుకోవడం కూడా గర్వకారణం గానే ఉంటుంది.
“భారతమాత పట్ల అచంచలమైన నమ్మకమే మన అసలైన శక్తి.”
“ఈ దేశానికి అంకితభావంతో నిలబడగలగడం – అదే మన బలం.”

ఇప్పుడు భారత్‌కి కావలసినది కేవలం రాజకీయ నాయకుడు కాదు, దేశాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే దూరదృష్టి గల వ్యక్తి. యోగిలా జీవించే మోడీ దేశానికి అంకితం అయిన నాయకుడు…

మౌనం, సహనం, వ్యూహం, దౌత్యం – ఇవే ఆయుధాలుగా నేటి భారత్ ముందుకు సాగుతోంది.
భవిష్యత్ తరాలకు అత్యంత అభివృద్ధి చెందిన భారత్ ను అందించాలంటే, మనమందరం ఒకే మాట చెప్పాలి…

About The Author