సేంద్రీయ వ్యవసాయం – పద్మ శ్రీ కమలాపుజారి
ఒక సాధారణ గిరిజిన స్త్రీ రైతుకు లభించిన పద్మ పురస్కారం. ఇంతకీ ఆమె ఎవరు? ఆమెకు ఎందుకా పురస్కారం?
సేంద్రీయ వ్యవసాయం – కమలాపుజారి
ఒడిశా, కొరాపుట్ జిల్లా, పత్రాపూట్ గ్రామానికి చెందిన కమలా పుజారి గిరిజన రైతు. ఆమెకు సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రాణం. కొన్నేళ్లుగా వందల దేశీయ వరి వంగడాలను సేకరించి నిల్వచేసి, పరిరక్షిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ సేంద్రీయ వ్యవసాయంపై మిగతా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రీయ ఎరువులను వాడాల్సిందిగా గ్రామస్థులను ఒప్పించడానికి ఆ దిశగా ప్రచారం చేస్తున్నారు దాంతో ఆమె ఉండే గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు కూడా రసాయన ఎరువుల వాడకం మానేసి సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ నుంచి శిక్షణ పొందిన ఆమె గ్రామస్థులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆ వ్యవసాయంతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. 2002లో సేంద్రీయ వ్యవసాయం నిర్వహణపై జొహెన్నెస్ బర్గ్‌లో జరిగిన వర్క్‌షాపునకు హాజరయ్యారామె. అదే సంవత్సరం దక్షిణాఫ్రికా నుంచి ఈక్వెటార్ ఇనిషియేటివ్ అవార్డు అందుకున్నారు. ఆమె సేవలను గుర్తించిన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళారైతు అవార్డుతో సత్కరించింది. తాజాగా ప్రభుత్వం ఆమెను రాష్ట్ర ప్రణాళిక మండలిలో సభ్యురాలిగా నియమించింది. అయినా ఆమె జీవనశైలిలో మార్పు లేదు. ఎప్పటిలానే పూరి గుడిసెలోనే నివసిస్తోంది. ఇప్పుడు ఆమెకు పద్మశ్రీ రావడం విశేషం.
——————–
ఒకప్పుడు పేరున్న వారికే పురస్కారాలు, కానీ ఇప్పుడు అతి సామాన్యులకు కూడా అత్యున్నత పురస్కారాలు అందుతున్నాయి. దశాబ్దాలుగా జరగనిది కేవలం 48 నెలల్లో జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నది మోదీ ప్రభుత్వం…