పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను భారీగా తగ్గించింది…
పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్ర్యరేఖకు దిగువన (బిపిఎల్) కుటుంబాలు ఒక్క రూపాయి చెల్లిస్తే నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఇతరులకు రూ.100కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు.
ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఇంటికి నల్లా కనెక్షన్ పొందేందుకు రూ.6,000 డిపాజిట్ తీసుకుంటున్నారు. ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తుతం రూ.10,500 డిపాజిట్ తీసుకుంటున్నారు. అంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండడం వల్ల పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు.
‘‘మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్నది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే, డిపాజిట్ ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లా కనెక్షన్ డిపాజిట్ ను తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, మిషన్ భగీరథ ద్వారా అందే శుద్దిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం అన్నారు.
‘‘రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల ఇండ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందు వల్ల మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో 6.7 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్ లభించలేదు. వీటికి తోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల మందికి నల్లా కనెక్షన్ అందాల్సి ఉంది. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. డిపాజిట్ ఎక్కువ ఉన్నందున వీరు నల్లా కనెక్షన్ తీసుకునేందుకు ముందుకు రారు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన డిపాజిట్ ను నామమాత్రం చేయాలని నిర్ణయించాం. ప్రజలందరూ శుద్ది చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’’ అని సిఎం ప్రకటించారు.
The Government has significantly reduced the deposit amounts for obtaining tap connections in Urban areas. In all Municipalities and Municipal corporations, the BPL families are required to pay just Rs. 1/- for tap connection and for others the amount would be Rs. 100/-.
Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao has signed the concerned file on Thursday afternoon.
Until now for obtaining a tap connection an amount of Rs. 6,000/- is being collected towards the deposit. If the connection is to be taken inside the house the deposit would be Rs, 10,500/-. In view of this huge amount as deposit people are not coming forward for taking tap connections felt the CM.
“The government has decided to supply safe drinking water to every village and towns through Mission Bhagiratha. The Government has made it a right to the people to obtain tap water. However, people are not coming forward to take connections in urban areas by depositing heavy amounts. There is a need to reduce this and make it a nominal amount. That is why the deposit amount is reduced significantly. The government wants that the purified drinking water to be consumed by everyone” said the CM.
In Municipalities and Corporations, the number of connections required to be given are 7.9 lakh. So far only 1.20 lakh connections are given. Due to the heavy deposit, the rest of the people are not coming forward to take connection. For 6.7 lakh households’ connections are not yet provided. In addition to this due to the drinking water schemes under construction another 3.3 lakh, connections are to be given. Altogether the total number of connections to the house are 10 lakhs. In view of heavy deposit, many are not coming forward to obtain connections. This will come in the way to realise the objective of providing safe drinking water through Mission Bhagiratha to all. Hence though it is a burden on the exchequer the deposit amount is reduced significantly and made namesake. The aim of the government is that people should consume safe drinking water and to be healthy.