అమెరికా వనంలో తెలుగు అమ్మాయి !

అమెరికా వనంలో ఈ కాషాయ హిందూ తులసి మొక్కకు ఏకంగా అమెరికా అధ్యక్షపదవే టార్గెట్…

తులసి గబార్డ్ , వయసు 37 ఏళ్లు,

ఆమె పేరు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నది అక్కడ స్థిరపడిన భారతీయులు, హిందువులతో పాటు ప్రపంచ హిందూజనాభాలో, భారతీయుల్లోనూ ఈ పేరు ఈమధ్య బాగా నలుగుతున్నది ఎందుకు?
అందరూ అనుకున్నట్టు ఈమె భారతీయురాలు కాదు,
ఓ హిందువు కర్మ రీత్యా హిందువు చైతన్య మహాప్రభు బోధించిన వైష్ణవాన్ని నిష్ఠగా ఆచరించే శుద్ధ శాకాహారి
ఓ అమెరికన్ సమోవా కేథలిక్ తండ్రికి, ఓ హిందూ తల్లికి పుట్టిన బిడ్డ, ఆమె చిన్నప్పటి నుంచే హిందువుగా పెరిగింది, హిందూ పురాణాలు, గ్రంథాలు, కర్మలు, ఆచారాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది తులసి అనే పేరు పెట్టింది అందుకే, ఆమెతోపాటు పుట్టిన వాళ్ల పేర్లు కూడా అంతే భక్తి, జై, నారాయణ్, బృందావన్ అయిదుగురు పిల్లల్లో ఈమె నెంబర్ నాలుగు ఇంకా చెప్పాల్సిన ‘ముచ్చట’ ఉంది
భగవద్గీతను తన మార్గదర్శిగా బహిరంగంగా చెెప్పుకునే ఆమె అమెరికన్ కాంగ్రెస్ తొలి హిందూ ప్రతినిధిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా భగవద్గీత పైనే ప్రమాణం చేసింది అదీ ఆమె నమ్మకం, ఆచరణ
తనను తాను కర్మయోగిగా చెప్పుకునే ఆమెకు భారతదేశంలోని బృందావనం అంటే విపరీతమైన ఆరాధన, ప్రేమ, భక్తి. ఈమె సైన్యంలో పనిచేసింది మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ కూడా, 2002లో ఎడ్వర్డో టమయోను పెళ్లి చేసుకుంది 2006లో విడిపోయింది కారణాలు ఏమయితేనేం?
అప్పటినుంచి విడిగానే ఉన్న ఆమె 2015 ఏప్రిల్‌లో అబ్రహాం విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది పక్కా వైదిక సంప్రదాయంలో, ఆమే ఎవరిని పెళ్లి చేసుకున్నా తన హిందూ మత విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, హిందువు అనే కారణంగా ఆమెను అమెరికాలో పనిచేసే, స్థిరపడిన భారతీయులు అధికంగా అభిమానిస్తారు ఆమెను, అదీ ఈమె ‘ముచ్చట

భారతీయులకు నష్టం వాటిల్లజేసేలా ట్రంపు తీసుకొస్తున్న హెచ్1బి, హెచ్4 వీసాల ఆంక్షలనూ ఆమె తప్పుపడుతున్నది
సరే, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే? ఆమె 2020 ఎన్నికల్లో ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికే పోటీపడాలని ప్రయత్నాలు ప్రారంభించింది అప్పుడే ఆమె టీం ఈ దిశలో విరాళాల సేకరణ, పబ్లిసిటీ వ్యూహాల్లో మునిగిపోయింది
అసలు అధ్యక్ష పదవికి పోటీపడాలంటే సొంత పార్టీలోనే అనేక అడ్డంకులు దాటాలి, అనేక మందిని దాటి రావాలి, తరువాత అసలు ఎన్నికలు అసలే ట్రంపు అమెరికా జాతీయవాదాన్ని బలంగా ప్రచారం చేసుకుంటూ, అదే బలంగా సాగుతున్న స్థితిలో ఓ హిందూ మతవిశ్వాసిని అమెరికన్ పార్టీల ప్రతినిధులు ఏమేరకు నెగ్గుకురానిస్తాయో చూడాలి సో, వాట్ ? ఆమె ఓ ఫైటర్ సంకల్పాన్ని మాత్రం వదలదలుచుకోలేదు
ఇతర అమెరికన్-భారతీయ హిందువులు తననే ఆదరించి మద్దతునిస్తారనీ ఆశపడుతున్నది ఆమె, గుడ్ ఆమె గెలవాలని ఆశిద్దాం. జై శ్రీ రామ్.

About The Author