భోజనానికి ముందు మనం చదువాల్సిన శ్లోకాలివే…

అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః
ఇతి సంచింత్య భుంజానః అన్నదోషై ర్న లిప్యతే

తత్పర్యం:-
ఈ అన్నమే బ్రహ్మ
ఇందులోని సారమే విష్ణువు
దీనిని భుజించేవాడు సాక్షాత్తూ మహేశ్వరుడే
ఇలా భావించి భుజించేవారికి అన్నదోషము అంటదు

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్
బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినాః

తత్పర్యం:-
బ్రహ్మము అనే అగ్నిలో బ్రహ్మము చేత సమర్పింపబడుతున్న ఈ హవిస్సు బ్రహ్మమే, అర్పణమూ బ్రహ్మమే. బ్రహ్మమే అయిన యఙ్ఞ కర్మలో నిలిచిన చిత్తము కలిగిన అట్టి వాడు పొందేదీ బ్రహ్మమే.

అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేశ మాశ్రితః
ప్రాణాయాన సయాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్

తత్పర్యం:-
నేనే వైశ్వానరాగ్నినై జీవుల శరీరాలను ఆశ్రయించి ప్రాణాపానాలతో కూడి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములచే నాలుగు రకాల అన్నములను అరిగిస్తున్నాను.

About The Author