RRR : రామ్ చరణ్‌కు గాయం…


ఆర్‌ఆర్ఆర్: రామ్ చరణ్‌కు గాయం

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి.. బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఈ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. జిమ్‌లో కసరత్తు చేస్తుండగా.. రామ్‌చరణ్ మడిమ భాగంలో గాయం కావడంతో షూటింగ్‌ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్ఆర్ బృందం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘‘నిన్న జిమ్‌లో కసరత్తు చేస్తుండగా.. రామ్‌చరణ్ మడిమ భాగంలో స్వల్పగాయమైనట్లు తెలుపుటకు చింతిస్తున్నాము. దీనితో పూణె షెడ్యూల్‌ని రద్దు చేశాము. మూడు వారాల తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాము’’ అని ఆర్‌ఆర్‌ఆర్ ట్వీట్ చేసింది.

About The Author