మంత్రాలయం టిడిపి అభ్యర్థి పాపం తిక్కారెడ్డి…
పాపం తిక్కారెడ్డి…
ఇటీవల మంత్రాలయం నియోజక వర్గంలో గుంపును చెదరగొట్టేందుకు టిడిపి అభ్యర్థి తిక్కారెడ్డి సొంత గన్ మ్యాన్ జరిపిన కాల్పుల్లో ఆయన కుడి కాలులో నుంచి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గన్ మ్యాన్ ఒంటి చేత్తో సినిమాల్లో షూట్ చేసినట్టు గాలిలోకి కాల్చగా వైబ్రేషన్ తో దిశమారి పక్కనే ఉన్న ఆయన తొడభాగంలోకి బుల్లెట్ దిగింది. బుల్లెట్ దూసుకెళ్లిన భాగంలో రెండంగుళాల మేర ఎముక ధ్వంస అయింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ డాక్టర్ల పర్యవేక్షణలో అప్పుడప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలింగు తర్వాత సింగపూర్ వెళ్లి ధ్వంసమైన చోట ఎముక పెరిగేలా చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నారు. దీనికి 6 నెలలు బెడ్ రెస్ట్ అవసరం. ఖర్చుకూడా భారీగా ఉంటుంది.(కోల్పోయిన బోన్ టిష్యూ పెరగడానికి ఇలాంటి ఎక్సటర్నల్ ఫిక్సేషన్లతో చికిత్స అవసరవుతుంది)