చిన్నారి నోట్లో టపాకాయ పేల్చిన ఉన్మాది …

చిన్నారి నోట్లో టపాకాయ పేల్చిన ఉన్మాది …
బాలిక పరిస్థితి విషమం .. యూపీలో ఘోరం..
దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా యూపీలో దారుణం చోటుచేసుకుంది. మిలాక్‌కు చెందిన ఓ యువకుడు తన రాక్షసానందం కోసం మూడేళ్ల చిన్నారి నోట్లో బాంబు పెట్టి పేల్చాడు. వివరాలు… మిలాక్‌కు చెందిన చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న హర్పాల్‌ అనే యువకుడు ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాడు.
ఈ క్రమంలో తన దగ్గర ఉన్న సుతిల్‌ బాంబు చిన్నారి నోట్లో పెట్టి అంటించాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఘటనపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

About The Author