కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ…
కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ
లేఖలో చంద్రబాబు…
ఈసీ తీరు దుర్మార్గం
బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది
ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను ఎన్నికల సంఘం బదిలీ చేయడం పోలీసుశాఖకు తప్పుడు సంకేతాలు పంపింది.
పోలీసు పరిశీలకుడు కె.కె.శర్మను బదిలీ చేయాలి
ఐటీ దాడులతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు
టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోలేదు
కె.కె.శర్మను పశ్చిమబంగకు ప్రత్యేక పోలీసు పరిశీలకునిగా నియమిస్తే అక్కడి తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
దీంతో ఆయనను ఏపీకి మార్చారు. శర్మ నియామకంపట్ల తృణమూల్ ఎలాంటి ఆందోళన వ్యక్తం చేసిందో, అది ఏపీకీ వర్తిస్తుంది.
ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న అధికారిని పోలీసు పరిశీలకునిగా నియమించడాన్ని చూస్తే ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించటం లేదన్న భావన కలుగుతోంది.
టీడీపీ అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తున్నారు.
ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్న స్ఫూర్తికి విరుద్ధం.
ఇది పార్టీ కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు, ఇతర పార్టీలను ప్రోత్సహించేలా ఉంది.
బీజేపీ పాలిత రాష్ట్రాలు, తమిళనాడులో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
కేవలం ఏపీలాంటి రాష్ట్రాల్లోని అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారని 66 మంది విశ్రాంత అఖిల భారత సర్వీసుల అధికారులు రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఎన్నికల సంఘాన్ని అంత మంది మాజీ అధికారులు తప్పుపట్టే పరిస్థితి రావడం దురదృష్టకరం.
అదే ఎన్నికల సంఘం తప్పుడు ఫారం-7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.
వైసీపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం వెంటనే స్పందిస్తోంది.
నిజానిజాలు నిర్ధారించుకోకుండా.. అధికారులు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోంది.
31 క్రిమినల్ కేసులు స్వయంగా ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నాయకుడి నిరాధారణ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తోంది.
ఇదే సమయంలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన బంధువులు గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు.
కేసు విచారణ జరుగుతుండగానే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
సహజ న్యాయసూత్రాలను పాటించని ఎన్నికల సంఘం పోలీసు అధికారిని వెంటనే బదిలీ చేసింది.