మోదుగుల ఇంటిపై ఐటీ దాడులు…
https://youtu.be/e4LKN6oq–E
గుంటూరు : గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోదుగుల వేణుగోపాల రెడ్డి ఇంటి పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు . ఎన్నికలకు కేవలం 12 గంటల సమయం కూడా లేకపోగా ఈ తరుణంలో ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల రెడ్డి తో పాటు ఆయన ఆడిటర్ మరియు. ఆయనకు కు ప్రధాన ఎన్నికల ఏజెంట్గా వ్యవహరిస్తున్న న్యాయవాది శ్యామల సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో అధికారులు ఎన్నికల ఖర్చు వివరాల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి దాడులకు వెరచేది లేదని తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఆదాయపు పన్ను దాడులు కుట్రపూరితంగా చేస్తున్నారని ని ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల రెడ్డి పేర్కొన్నారు. ప్రజాబలం తనకు అండగా ఉన్నంతవరకు ఎవరెన్ని కుట్రలు చేసినా తనకు ఏమీ కాదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు అండగా ఉండబోతున్నారని, తను విజయం సాధిస్తానని అన్నారు.