భారతీయులు ఉపయోగించిన పుష్పక విమానాల గురించి సంపూర్ణ వివరణ…

అంతకు ముందు పోస్టులో మీకు మన ప్రాచీన భారతీయులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి కొన్ని విశేషాలు మీకు తెలియచేశాను . ఇప్పుడు కొంతమంది ప్రాచీన విమానవిద్య నిపుణుల పేర్లు మీకు వివరిస్తాను . వరుసగా

నారాయణముని , శౌనకుడు, గర్గుడు, వాచస్పతి, చాక్రాయణి , దండినాధుడు, విశ్వనాథుడు, గౌతముడు, లల్లాచార్యుడు , విశ్వంభరుడు, అగస్త్యుడు, గోభిలుడు , అత్రి, గాలవుడు , వ్యాసుడు వీరు కాక మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మొత్తం 36 గురు విమానవిద్యానిపుణులు కలరు. అదేవిధంగా మరికొన్ని ప్రాచీన రహస్య గ్రంథాలలో కూడా ఈ పుష్పక విమాన విశేషాలు ఇవ్వడం జరిగింది. ఆ రహస్యగ్రంధాల పేర్లు మీకు నేను వివరిస్తాను. అవి

క్రియాసారము , యంత్రసర్వస్వము , శౌనకీయము , లోహతంత్రము, దర్పణ ప్రకరణము, విమాన చంద్రిక, వ్యోమయాన తంత్రము , యంత్రకల్పము, ఖేటయాన ప్రదీపిక , యానబిందువు , మణిభద్రకారిక , లోహాప్రకారణము , వ్యోమయానార్క ప్రకాశము, శక్తితంత్రము , దర్పణ శాస్త్రము, ధాతు సర్వస్వము , శబ్దమహోదధి , గతినిర్ణయాధ్యాయము , సమ్మోహక్రియాకాండము , రూపశక్తి ప్రకరణము , ఔషధీ కల్పము .ఇలా 97 రహస్య గ్రంథాలలో ప్రాచీన విమానయాన రహస్యాలు ఉన్నాయి.

మహర్షి భరద్వాజుడు రచించిన సూత్రము యొక్క వ్యాఖ్యాన ప్రసంగములో బోధానంధయతి విమానాశబ్దాన్ని వివరిస్తూ నలుగురు ఆచార్యులు ఇచ్చిన పలు అర్ధాలను పొందుపరిచారు. ఆ నలుగురు ఆచార్యుల పేర్లు లల్లాచార్య, నారాయణాచార్య, శంఖాచార్య, విశ్వంభరాచార్య వారు పొందుపరిచిన అర్ధములలో ఒక్కటి మీకు వివరిస్తాను .

ఒక దేశము నుండి ఇంకొక దేశమునకు , ఒక ద్వీపము నుండి మరియొక ద్వీపమునకు అదే విధముగా ఒక లోకము ( గ్రహము ) నుండి మరియొక లోకమునకు ఆకాశములో ప్రయాణము చేయగలది ఈ విమానము అని ఆకాశ శాస్త్ర నిపుణులు నిర్వచించారు. అదేవిధముగా విమాన చోదకుని ( పైలెట్ ) అర్హతలు ఏమిటి అన్నది కూడా కులంకుశముగా వివరించారు . ఈ అంశంపైనా అతడు మొత్తం విమానచోదకుడు 32 రకాల అర్హతలు కలిగి ఉండాలని తీర్మానించారు. ఈ అర్హతల గురించి లల్లాచార్యుడు “రహస్యలహరి ” అనే గ్రంథములో వర్ణించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఆ అర్హతల గురించి సంక్షిప్తముగా తెలియచేస్తాను .

32 రకాల అర్హతలు –

మాంత్రిక, తాంత్రిక, కృతక, అంతరాలక , గూడ , దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్షక, సంకోచ, విస్తృత, విరూపకరణ, రూపాంతర , సురూప, జ్యోతిర్భావ , తమోమయ, ప్రలయ , విముఖ , తారా , మహాశబ్ద విమోహన, లంఘన , సార్పగమన, పల, సర్వోతోముఖ , పరశబ్ద గ్రాహక , రూపాకర్షణ, క్రియా రహస్య హరణ , కర్షణ, దిక్ ప్రదర్శన, ఆకాశాకార, స్తబ్దక, జలదరూప, ఇలా 32 రకాల అర్హతలే కాక మరొక 5 రకాల అర్హతలు కూడా అవసరం అని మరొక సూత్రములో తెలియచేశారు. దీనిని శౌనక ఋషి రేఖాపధము , మండలము , కక్ష్య, శక్తి, మరియు కేంద్రము అను అయిదు విధములైన ఆకాశమార్గములు చోదకునకు తెలియుట అత్యావశ్యకం అని తెలియచేసారు.

పైన తెలిపిన విమాన చోదకునికి ఉండవలసిన అర్హతలలో కొన్నింటి వివరణ మీకు తరవాతి పోస్టులో వివరిస్తాను.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

కాళహస్తి వేంకటేశ్వరరావు

9885030034

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

About The Author