15 పోలింగ్‌ కేంద్రాల్లో సున్నా శాతం ఓటింగ్‌…ఈ సీ…


మావోయిస్టుల భయంతో పోలింగ్‌కు దూరం

భువనేశ్వర్‌: ఒడిశాలోని మాల్కాన్‌గిరి జిల్లాలోని చిత్రకొండ, మథిలిల్లోని 15 పోలింగ్‌ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు. మావోయిస్టుల భయంతో ఈ పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఒడిశా ఎన్నికల ప్రధానాధికారి సురేంద్ర కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా, గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఒడిశాలో 66 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన వివరించారు. కాగా, రాష్ట్రంలోని కలాహండీ జిల్లా బెజీపదార్‌ గ్రామస్థులు గురువారం జరిగిన ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్లు వంటి కనీస సదుపాయాలు కూడా లేవని దీంతో తాము ఓటింగ్‌ను బహిష్కరించామన్నారు. తమ గ్రామంలోకి రాకపోకలు జరపడానికి రెండు మార్గాలు ఉంటాయని అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని వారు తెలిపారు. 2017 నుంచి తాము ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ వాటిని బాగుచేయలేదని తెలిపారు.

About The Author