మీకు *వెనెజులా* అనే దేశం గురించి తెలుసా ?
మీకు *వెనెజులా* అనే దేశం గురించి తెలుసా ?
వైశాల్యం లో మన దేశం లో నాల్గవ వంతు.
మన జనాభా సుమారు 133 కోట్లు
వాళ్ళ జనాభా సుమారు 3 కోట్లు
వారిది మనకంటే సారవంతమయిన నేల, వందల నదులు, వేల కిలోమీటర్ల సముద్ర తీరం.
అయినా కరువు తాండవిస్తుంది – దాదాపు నరమాంస భక్షకులులా బ్రతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు.
అక్కడి ప్రజలకు వ్యవసాయం లేదు, పంటలు లేవు, పశువులు లేవు, పాలు లేవు, అన్ని నదులు, చుట్టూ సముద్రం ఉండి కూడా మత్స్య సంపద ఉపయోగ పడదు.
కారణం ద్రవ్యోల్బణం (Inflation) ఆర్ధిక మాంద్యం.
మన ఒక్క రూపాయికి 3607 వెనెజులా బోలివర్స్ వస్తాయి.
ఒకప్పుడు మన కంటే ధనిక దేశం – ఒకప్పుడంటే ఎప్పుడో కాదు. కేవలం 20 సంవత్సరాల క్రితం వరకు.
గొప్ప నాయకుడు 20 ఏళ్లలో తనదేశాన్ని సింగపూర్ లో ఎలా మార్చగలడో – ఒక *చవట* నాయకుడు తన దేశాన్ని *వెనెజులా* లాగా తయారు చేస్తాడు.
వెనెజులాలో అసలేం జరిగింది !
విస్తారమయిన సారవంతమయిన భూమి,
అంతులేని మత్స్య సంపద, రోజుకు మిలియన్ బారెల్స్ వెలికి తియ్యగల ఆయిల్ నిక్షేపాలు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఏర్పడ్డ పెట్రోల్ అవసరాలను తీర్చిన దేశం.
సరిగ్గా అప్పుడే ఆ దేశంలో రాజకీయ నాయకులు వింత వింత మేనిఫెస్టోలతో ముందుకు వచ్చారు.
అన్నీ ఫ్రీ. ఫ్రీ.. ఫ్రీ
ఇంకేముంది ప్రజలు సోమరులయ్యారు. 1950, 60 లలో ప్రపంచ దేశాలు ఉత్పాదకలో పోటీ పడుతుంటే – అక్కడి ప్రజలు గుండు సూది కూడా దిగుమతి చేసుకున్నారు. ప్రపంచానికి వారివద్ద ఉన్న ఆయిల్ ఇచ్చి ప్రతిదీ దిగుమతి చేసుకున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చాయి, ఉచిత భోజనం, ఉచిత వైద్యం, అన్ని సేవలూ ఉచితమ్……. ఎవ్వడూ పనిచెయ్యడు…
విదేశీయులు వస్తే పనిచెయ్యనివ్వడు. కారణం వారి ఉచిత సేవలను విదేశీయులు ఎందుకు వాడుకోవాలని.
మన నాయకులు కూడా కేవలం ఎన్నికలలో గెలవటానికి అన్నీ ఉచితాలు ప్రకటిస్తున్నారు… ప్రజలను సోమరులు గా మార్చే పని చేస్తున్నారు.
మన దేశం మరో వెనెజులా కాకముందే మేలుకోండి…..
సంపదను సృష్టించే వాడు కావాలి… పంచే వాడు కాదు.
ఉద్యోగాలు సృష్టించే వాడు కావాలి – నిరుద్యోగ భృతి ఇచ్చేవాడు కాదు.
ఆహారం సంపాదించుకునే మార్గం చూపే వాడు కావలి – అన్నం పెట్టి సోమరులుగా మార్చే వాడు కాదు.
ప్రజలకు భద్రతనిచ్చే వాడు కావలి – భయకంపితులను చేసేవాడు కాదు.
ప్రజలు సంపాదించుకొన్న దానిని దాచుకో గలగాలి – దోచుకునే వాడు కాదు.
మన నాయకులు ఎలా ఉండాలో బాగా ఆలోచించండి…