ఏప్రిల్ 20 నుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు…
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుండి 29వ తేదీ వరకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 10 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నెల్లూరు జిల్లా..
– ఏప్రిల్ 20వ తేదీన నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
– ఏప్రిల్ 21న చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– ఏప్రిల్ 22న దగదర్తి మండలం పెద్ద పుతేడు గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– ఏప్రిల్ 23న కొండాపురం మండలం తూరుపు ఎర్రపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– ఏప్రిల్ 24న వరికుంటపాడు మండలం జదదేవి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
ప్రకాశం జిల్లా..
– ఏప్రిల్ 25న యర్రగొండపాళ్యం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– ఏప్రిల్ 26న డోర్నాల మండలంలోని పి.డోర్నాల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– ఏప్రిల్ 27న సంతనూతలపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– ఏప్రిల్ 28న నాగులప్పాడు మండలంలోని వినిగిరిరాయనిపాళ్యం గ్రామంలోగల శ్రీరామాలయం ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
– ఏప్రిల్ 29న జరుగుమిల్లి మండలంలోని నందనవనం గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.