ఆకుల్లో భోజనాలు ఎందుకు . . ?
“అరటి, రావి, మోదుగ, మర్రి” వంటి పచ్చ ఆకుల్లో భోజనం సకల శుభకరము, ఆరోగ్యకరము.
వివాహాది శుభకార్యాలలో ఒకప్పుడు విధిగా అనగా తప్పనిసరిగా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు. ఆరోగ్య శాస్త్రాలు, పురాతన శాస్త్రాలు భోజనం అరటాకులోనే ఉత్తమమని తెలుపుతున్నాయి.
ఆకుల్లో ఔషధ గుణాలున్నాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాగే రావి ఆకులో భోజనం చేస్తే జననేంద్రియ దోషాలు పోతాయి. చిన్న పిల్లలకు చక్కటి మాటలు వస్తాయి.
మోదుగ విస్తరి లో భుజిస్తే నేత్ర దోషాలు తొలగుతాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉగాది రోజున చేసే భక్షాలను మోదుగ ఆకులో తినడం ఆనవాయితీగా వస్తోంది.
మర్రి ఆకులతో కుట్టిన విస్తరి లో భోజనం చేస్తే పూర్తి ఆరోగ్యం. అందుకే దేవతలకు పెట్టె నైవేద్యాన్ని మర్రి ఆకుల విస్తరిలో నివేదించడం జరుగుతుంది.
పచ్చటి ఆకుల్లో భోజనం చేస్తే ఆకుల్లోని క్లోరోఫిల్ వల్ల అనేక రుగ్మతలు, పేగుల్లోని క్రిములు దూరమవుతాయి.
ఈ విషయాలను గమనించిన మన పూర్వీకులు అప్పట్లోనే శాస్త్రీయ పద్దతిలో ఆకుల్లో భోజనం చేయడం మంచిదని తెలిపారు. కానీ ఇప్పటి జనం అందులోని అర్థం తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతికి తలొగ్గి ఎంతో గొప్పవి అయిన మన ఆచారాలను కనుమరుగు చేస్తున్నారు . . .