రాయలసీమ. వెయ్యినుతలకొన..


అందమైన సహ్యాద్రి పర్వతాలను అనుకోని వెలసిన లక్ష్మీనరసింహ దేవాలయ సమూహమే ఈ పవిత్ర క్షేత్రం..
రాయలసీమ లో నిత్యం కరువుకాటకాలతో కొట్టుమిట్టాడే ప్రాంతంలో ఇక్కడ వెయ్యు నూతులు(బావులు)ఉండేవి..
అవి ఇక్కడి నుండి గువ్వలచేరువు కొండల.వరకు వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు బూడిపోయ్యాయి కానీ ఒకప్పుడు నిరంతరం నీటి జాడలతో ఉండేవి..
ఇక్కడి ప్రాంతానికి వందల వేల సంవత్సరాల చరిత్ర ఉంది..
ఇక్కడ రాముడు,సీత తిరిగడారని చరిత్ర చెప్తుంది..
ఇక్కడ కాకులు కూడా ఉండవని చెప్తారు..
ఇక ఇక్కడి పర్వతాల గురించి ఎంత చెప్పినా తక్కువే అందమైన అద్భుతమైన పర్వత శ్రేణులతోబావులతో కలిసిఉన్న ప్రాంతమే ఇది..
ఇక్కడి కొలనులలో బావుల్లో స్వచ్ఛమైన నీళ్లు మనకు కనపడతాయి..ఇక్కడి నీళ్లలో ఎన్నో రోగాలను బాధల్ని కష్టాలని శాశ్వత విముక్తి చేసే శక్తి ఉందని పూర్వం నుండి నానుడి..
ఇక అన్నమాచార్యులు కూడా ఈ ప్రాంతం పై కీర్తనలు రాసాడు..ఇక్కడ వెలసిన లక్ష్మీ నరసింహస్వామి మరియు అమ్మవారి గుళ్ళు ఎంతో అద్భుతమైన శిల్పకలతో ఉన్నాయి..
కొండ ప్రాంతంలో చెట్ల కింద ఊట బాబుల్లో.సేద తీరాలంటే తప్పకుండా అందరూ మా రాయలసీమ ని ముఖ్యన్గా..
కడప పులివెందుల రహదారి లో పెండ్లి మర్రి దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాల్సిందే..
నిన్న కడప రాయలసీమ వాదుల సమావేశం సందర్బంగా వెళ్ళినప్పుడు ఇక్కడి పర్వతాల్లో సేద తీరడం జరిగింది..

About The Author