శ్రీలంక ఆత్మాహుతి దాడుల వీడియోలు విడుదల
https://www.facebook.com/firstbulletintelugu/videos/440767706681223/?t=22
కొలంబో: శ్రీలంకలోని చర్చ్‌లు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా గత ఈస్టర్ ఆదివారం నాడు జరిగిన ఆత్మాహుతి దాడుల వీడియోలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. బరువైన బ్యాగ్ వేసుకుని చర్చి లోకి వెళుతున్న ఓ వ్యక్తి ఇందులో కనిపిస్తున్నాడు. చర్చిలోకి వెళుతున్న వ్యక్తి ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతను లోపలి వెళ్లి వంటికి అమర్చుకున్న బాంబులతో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. శ్రీలంకలో గత ఆదివారం జరిగిన భీకరమైన ఉగ్రవాద దాడుల్లో 321మంది మరణించగా.. 500 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. బాంబు దాడుల నేపథ్యంలో పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయని ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే.