తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి అకాడమీ మేనేజింగ్ డైరెక్టరు డా. అశోక్ కుమార్ జైన్

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి అకాడమీ మేనేజింగ్ డైరెక్టరు డా. అశోక్ కుమార్ జైన్

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి అకాడమీ మేనేజింగ్ డైరెక్టరు డా. అశోక్ కుమార్ జైన్ మరియు పి.సి.సి.ఎఫ్. శ్రీ రఘువీర్ గారు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఆరు రిజియన్ల నుండి వచ్చిన సుమారు 600 మంది క్రీడాకారులు మార్చ్ పాస్ట్ లో పాల్గొని కన్నుల విందుగా కవాతు చేశారు.రెండు రోజులపాటు జరగనున్న ఈవెంట్స్. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న అన్ని జిల్లాలకు చెందిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది.అటవీ సిబ్బందికి స్పోర్ట్స్ మీట్ దేశంలో మొదటిసారి ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే. ఆ తర్వాతే మిగతా అన్ని రాష్టాల్లో మొదలయ్యాయి. తెలంగాణ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.ఈ పోటీల్లో విజేతలను జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ మీట్ కు ఎంపిక చేస్తాం. మహిళా ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో క్రీడల్లో పాల్గొనాలి అని అన్నారు ఫారెస్ట్ కార్పొరేషన్ VC and MD ఏ. కే. జైన్, Pccf రఘువీర్.
ఈ రోజు జరిగిన క్రీడలలో ఇంతవరకు ఖమ్మం రీజియన్ మొదటి స్థానంలో హైదరాబాద్ రీజియన్ రెండవ స్థానంలో మరియు కరీంనగర్ రీజియన్ మూడవ స్థానంలో వున్నాయి. 100 మీ. ఓపెన్ కేటగిరి లో వై. హారిక ఖమ్మం మొదటి స్థానం లో నిలిచారు. 800 మీ. పురుషుల ఓపెన్ కేటగిరి లో యస్. మురళి కృష్ణ ఖమ్మం మొదటి స్థానం లో వచ్చారు. షాట్ పుట్ పురుషుల ఓపెన్ లో బి. రాజు ఆదిలాబాదు మహిళల విభాగంలో వై హారిక ఖమ్మం మొదటి స్థానాలు పొందారని ఫారెస్ట్ అకాడెమీ డైరెక్టర్ కోట తిరుపతయ్య తెలిపారు.

About The Author